Hyderabad Bomb Threat in Flights: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత.. మూడు విమానాలకు బాంబు బెదిరింపులు..
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:53 AM
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత నెలకొంది. మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దీంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్రిక్తత నెలకొంది. కన్నూర్–హైదరాబాద్, ఫ్రాంక్‌ఫర్ట్–హైదరాబాద్, లండన్–హైదరాబాద్ మార్గాల్లో ప్రయాణిస్తున్న విమానాలకు బాంబు పెట్టినట్లు ఈ మెయిల్ రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆ మూడు విమానాలు ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే అధికారులు అత్యవసర తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లు సంబంధిత విమానాల్లో దశలవారీగా తనిఖీలు ప్రారంభించాయి. ప్రయాణికుల లగేజీలు, క్యాబిన్ బ్యాగులు, కార్గో విభాగాలను పూర్తిగా పరిశీలిస్తున్నారు. అలాగే, ఈ మెయిల్స్ ఎవరు పంపారన్న దానిపై సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు ప్రారంభించింది.
Also Read:
ఏపీలో మరో కొత్త స్కాం.. వెలుగులోకి సంచలన విషయాలు
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు..
For More Latest News