Oil Palm Cultivation: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు..
ABN , Publish Date - Dec 08 , 2025 | 07:40 AM
ఆయిల్ పామ్ సాగుతో అధిక గడించవచ్చని ఉద్యానవన రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయిల్ పామ్ సాగుతో ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు.
కోరుట్ల రూరల్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ఆయిల్ పామ్ సాగుతో అధిక గడించవచ్చని ఉద్యానవన రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అయిల్ పామ్ సాగుతో ప్రకృతి వైపరీత్యాల వలన ఎటువంటి నష్టం వాటిల్లదని పేర్కొంటున్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి రైతులకు వివరిస్తున్నారు. కోతులు, పక్షుల బెడద ఉండదని ప్రచారం నిర్వహిస్తూ ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
నీటి వినియోగం తక్కువ
ఆయిల్ పామ్ సాగుకు నీరు నిల్వ ఉండని అన్ని రకాల నేలలు అనుకూలం.
ఒక ఎకరం వరి పండించే నీటితో నాలుగు ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేసుకోవచ్చు.
ఆయిల్ పామ్ మొక్కలు నాటిన 14నెలల నుంచి 18 నెలల తర్వాత పూతకు వస్తాయి.
పరాగ సంపర్కం "ఎలడోబియన్ కామోరూనకస్" అనే కీటకాల ద్వారా జరుగుతుంది.
మొదటి కోత నాటిన 36 నెలల తర్వాత ప్రారంభం అవుతుంది.
ప్రతి 45 రోజుల నుంచి 60 రోజులకు ఒకసారి ఆయిల్ పామ్ కాయలు కోతకు వస్తాయి.
సాగుకు సబ్సిడీలు
ఒక మొక్క ఖరీదు రూ.193 ఉండంగా రైతు రూ.20 చెల్లించి మొక్కను పొందవచ్చు.
ఒక ఎకరానికి 57 మొక్కలు నాటాలి.
డ్రిప్ ఇరిగేషన్ పైన రైతు యొక్క భూమిని బట్టి 80 శాతం, 90 శాతం, 100 శాతం సబ్సిడీ ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ రైతులు డ్రిప్ కోసం జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది.
పెట్టుబడి సహాయం కింద ఒక ఎకరానికి అంతర పంటల నిర్వహణకు రూ.2100 ఆయిల్ పామ్ సాగుకు. zeta = 2100 చొప్పున మొత్తం ఎకరానికి రూ.4200 రైతుల ఖాతాలో జమ చేస్తారు.
ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులకు 4 సంవత్సరాల వరకు పెట్టుబడి సాయం అందుతుంది.
ప్రతి నెల ఒకటో తేదీన ప్రభుత్వమే ధర నిర్ణయిస్తుంది. ప్రతి 12 నెలలకు ఒకసారి కోతకు రావడం వలన రైతులకు నిరంతర ఆదాయం వస్తుంది.
దళారి వ్యవస్థ లేకుండా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు పడే అవకాశం ఉంది.
అయిల్ పామ్‌లో అంతర పంటలుగా కోకో, వక్క వంటివి నాటడం వల్ల ఒక సంవత్సరానికి 1 ఎకరంలో రూ.3లక్షల నుంచి 4 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం