-
-
Home » Mukhyaamshalu » Andhra pradesh Telangana national and International latest breaking news and live updates on 8th Dec 2025 vreddy
-
BREAKING: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
ABN , First Publish Date - Dec 08 , 2025 | 07:31 AM
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Dec 08, 2025 11:51 IST
కేరళ: ఎర్నాకుళం కోర్టులో నటుడు దిలీప్‌కు ఊరట
లైంగిక వేధింపుల కేసులో A8 దిలీప్‌ను నిర్దోషిగా తేల్చిన కోర్టు
దోషిగా ఎలాంటి ఆధారాలు లేవన్న ఎర్నాకుళం కోర్టు
A1 నుంచి A6 వరకు దోషులుగా నిర్ధారించిన ఎర్నాకుళం కోర్టు
-
Dec 08, 2025 11:32 IST
రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ పాలన ఇది: మాజీ మంత్రి హరీశ్‌రావు
రెండేళ్లలో రేవంత్ ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీలేదు: హరీశ్‌రావు
కేసీఆర్ ప్రారంభించిన స్కీమ్‌లు అన్ని అటకెక్కించారు: హరీశ్‌రావు
తెలంగాణలో రోడ్లు, స్కూళ్లు, ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయి: హరీశ్‌రావు
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, అభివృద్ధి ఏదీ జరగలేదు: హరీశ్‌రావు
-
Dec 08, 2025 11:14 IST
భారత్‌తో బంధాన్ని అమెరికా బలోపేతం చేసుకోవాల్సిందే
నొక్కి చెప్పిన అమెరికా నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్-2026
ఆదివారం దీనిని విడుదల చేసిన అమెరికా కాంగ్రెస్ నాయకులు
-
Dec 08, 2025 11:14 IST
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ భద్రత
6వేల మంది పోలీస్ సిబ్బంది, అక్టోపస్ బలగాలతో బందోబస్తు
ఓఆర్‌ఆర్ నుంచి ప్రధాన వేధిక వరకు డ్రోన్లతో నిఘా
-
Dec 08, 2025 10:26 IST
ఇండిగో షేర్లు భారీగా పతనం
ట్రేడింగ్ మొదట్లో 7% విలువ కోల్పోయిన ఇండిగో షేర్లు
తర్వాత కోలుకుని ప్రస్తుతం 3 శాతానికి పైగా నష్టాల్లో కంపెనీ షేర్లు
-
Dec 08, 2025 10:06 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉక్కు నిర్వాసితుల ఆందోళన
మెయిర్‌గేట్ ఎదుట బైఠాయించి నిర్వాసితుల నిరసన
డ్యూటీలకు వెళుతున్న వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత
ఉద్యోగులు, నిర్వాసితుల మధ్య పరస్పర వాగ్వాదం
-
Dec 08, 2025 10:05 IST
గుంటూరు: మంగళగిరిలో శ్రీకృష్ణుని మందిరం వద్ద ఉద్రిక్తత
శ్రీకృష్ణుని విగ్రహం తొలగించేందుకు మున్సిపల్ అధికారుల యత్నం
విగ్రహం తొలగించవద్దంటూ అడ్డుకుని ఆందోళనకు దిగిన భక్తులు
విగ్రహం మరోచోట ప్రతిష్టించేందుకు కొంత సమయం ఇవ్వాలని డిమాండ్
-
Dec 08, 2025 08:53 IST
అమరావతి: మ.12గంటలకు సీఎం చంద్రబాబు ప్రెస్‌మీట్
ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మాట్లాడనున్న చంద్రబాబు
సా.4గంటలకు ఆర్టీజీఎస్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష
-
Dec 08, 2025 08:29 IST
నెట్‌ఫ్లిక్స్-వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ డీల్‌ను సమీక్షిస్తా: ట్రంప్ ప్రకటన
వినోద రంగంలో రూ.6.48 కోట్లతో జరిగిన భారీ ఒప్పందాల్లో ఇదొకటి
ఈ ఒప్పందంతో నెట్‌ఫ్లిక్స్ మార్కెట్ షేర్ భారీగా పెరుగుతుందని ట్రంప్ ఆందోళన
-
Dec 08, 2025 08:14 IST
హైదరాబాద్‌లో 77 ఇండిగో విమానాలు రద్దు
విశాఖ నుంచి 7 ఇండిగో విమానాలు రద్దు
-
Dec 08, 2025 08:13 IST
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం
కాంట్రాక్టర్, గుమస్తాను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
మావోయిస్టుల చెర నుంచి తప్పించుకున్న గుమస్తా
కాంట్రాక్టర్ కోసం భద్రతా బలగాల గాలింపు
-
Dec 08, 2025 08:13 IST
ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు అడ్వైజరీ జారీ
ఇవాళ కూడా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచే అవకాశం
ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచన
-
Dec 08, 2025 07:31 IST
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
కన్నూర్-హైదరాబాద్, ఫ్యాంక్‌ఫెర్ట్-హైదరాబాద్,..
లండన్-హైదరాబాద్ విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సేఫ్‌గా ల్యాండైన విమానాలు
మూడు విమానాల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు
-
Dec 08, 2025 07:31 IST
నేడు గంగవరం పోర్టు ముట్టడికి కార్మికుల పిలుపు
ఒప్పందం అమలులో కాలయాపన చేయడంపై ఆగ్రహం
-
Dec 08, 2025 07:31 IST
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
సదస్సుకు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు
పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు
మ.1:30కు సదస్సును ప్రారంభించనున్న గవర్నర్
మ.2:30కు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం
సదస్సులో నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాష్ ప్రసంగాలు
గ్లోబల్ సమ్మిట్‌లో వివిధ అంశాలపై 27 సెషన్లలో చర్చలు