TG News: సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన రాజా సింగ్
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:39 AM
Raja Singh: తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Hyderabad: కొత్త గోశాల (Gosala) నిర్మించాలనే నిర్ణయం, తల్లి ఆవు గురించి ఆలోచించినందుకు, విధివిధానాలపై కమిటీని వేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (BJP MLA Raja Singh) ధన్యవాదాలు (Thanks) తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. వేల సంఖ్యలో ఆవులు, దూడలు, ఎద్దులను ఇల్లీగల్ స్లేటర్ హౌస్‌లో చంపుతున్నారని దాని గురించి సీఎం ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్పాలని కోరారు. మోడల్ గోశాలలు కడుతున్నారని.. చాలా మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.
రెండవ పేరు సీఎం రేవంత్ రెడ్డిదే..
గో రక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ తయారు చేయాలని, అందులో ఒక మెంబర్‌గా తనను కూడా ఉంచాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సిఎం రేవంత్ రెడ్డిని కోరారు. దేశంలోని ముఖ్యమంత్రులందరిలో గోవులకు సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరని అడిగితే, గుర్తుకు వచ్చే రెండవ పేరు రేవంత్ రెడ్డిదేనని అన్నారు. మొదటి పేరు యూపీ సీఎం యోగి అని పేర్కొన్నారు. ఈ పనులన్నీ ముఖ్యమంత్రి చేస్తే భారత దేశంలో ఒక మంచి గుర్తింపు దొరుకుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
ముగ్గురు అధికారులతో ఒక కమిటీ..
తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించారు. గోవుల సంరక్షణ కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను అధ్యయనం చేయాలని ఈ కమిటీని కోరారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఈ కమిటీలో ఉన్నారు. గో సంరక్షణపై రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. గోశాలలకు భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారని, కానీ వాటి సంరక్షణకు తగినంత స్థలం లేకపోవడం, ఇతర సమస్యలతో అవి ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు రాష్ట్రంలో తొలుత నాలుగు ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సీఎం ఆదేశించారు.
గోశాలల నిర్మాణం ఎక్కడంటే..
వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశుసంవర్ధక శాఖ విశ్వవిద్యాలయం సమీపంలోని విశాల ప్రదేశాల్లో తొలుత గోశాలలు నిర్మించాలన్నారు. వేములవాడలో కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబర్చాలని సీఎం సూచించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలన్నారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన విధానపత్రాన్ని అధికారులు సీఎంకు అందజేశారు.
ఇవి కూడా చదవండి:
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర.. యోగాసనాలు వేసిన అనిత
మొబైల్, లాప్ టాప్ సమర్పించడానికి కేటీఆర్‌కు డెడ్ లైన్
For More AP News and Telugu News