Azharuddin: ఏ శాఖ ఇచ్చినా ఓకే: మంత్రి అజారుద్దీన్
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:01 PM
నూతన మంత్రి అజారుద్దీన్‌కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి మంత్రివర్గంలోకి ఆహ్వానం పలికారు. ఈ మేరకు.. అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు.. మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్ ఇవాళ(శుక్రవారం) ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు అజారుద్దీన్‌తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. మంత్రివర్గంలో అజారుద్దీన్ చేరికతో తెలంగాణ కేబినెట్ మంత్రుల సంఖ్య 16కి చేరింది. అయినా తెలంగాణ కేబినెట్‌లో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే..
ఈ సందర్భంగా నూతన మంత్రి అజారుద్దీన్‌కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి మంత్రివర్గంలోకి ఆహ్వానం పలికారు. ఈ మేరకు.. అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి రావడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. తన మంత్రి పదవికి, జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముడి పెట్టొద్దని పేర్కొన్నారు. రెండింటినీ వేర్వురుగా చూడాలని కోరారు. తానేంటో ప్రజలందరికీ తెలుసని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తానని అజారుద్దీన్ స్పష్టం చేశారు.
మంత్రి వర్గ విస్తరణపై గత కొన్ని రోజులుగా ఏఐసీసీలో కసరత్తు జరిగింది. ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో 15 మంది ఉండగా.. మరో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. రాష్ట్రంలో ఎప్పుడు కేబినెట్ ఏర్పడినా.. ముస్లిం మైనార్టీకి ఒక మంత్రి పదవి ఉండేది. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది ముస్లిం మైనార్టీలు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఈసారి ఎక్కడా గెలవలేదు. దీంతో ఆ వర్గానికి చెందిన అజారుద్దీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్‌లో స్థానం కల్పించింది.
ఇవి కూడా చదవండి..
Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్