Amberpet Kidnap: ఆస్తిపై కన్నేసి.. భర్తను కిడ్నాప్ చేయించి..
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:50 PM
తనను, పిల్లల్ని చూసుకోవడం లేదని, అలాగే తనకు ఆస్తిలో రావాల్సిన వాటా ఇవ్వడం లేదని ఓ భార్య, భర్తను కిడ్నాప్ చేయించింది. సుమారు పది మందితో కలిసి భర్త కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. ఇంతకు అసలు ఏం జరిగిందంటే..
హైదరాబాద్: అంబర్‌పేట్‌కు చెందిన మంత్రి శ్యామ్ కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. మొదటి భార్య మాధవి లతే శ్యామ్‌ను కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. మొదటి భార్య మాధవి లతతో విభేదాలు రావడంతో ఫాతిమా అనే మహిళను శ్యామ్ రెండో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఆస్తి తగాదాలతో పాటు ఇతర కారణాలతో భర్త శ్యామ్‌ను మాధవి లత కిడ్నాప్ చేయించిందని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించారు.
తనను, పిల్లల్ని చూసుకోవడం లేదని మాధవి లత కిడ్నాప్‌కు ప్లాన్ చేసిందని డీసీపీ బాలస్వామి తెలిపారు. మంత్రి శ్యామ్ రెండు నెలల క్రితం తన ఆస్తులను అమ్మేశాడని పేర్కొన్నారు. ఆ ఆస్తి పంపకాల విషయంలో కూడా విబేధాలు వచ్చాయన్నారు. మెదటి భార్య మాదవి లత తనకు తెలిసిన దుర్గ వినయ్‌తో కలిసి కిడ్నాప్‌కి ప్లాన్ చేసిందని చెప్పారు. అక్టోబర్ 29న మంత్రి శ్యామ్‌ను తన ఇంటి నుంచి కిడ్నాప్ చేశారన్నారు. దుర్గ వినయ్, సాయి మరో ఇద్దరు యువతులు.. మరికొంత మంది కలిసి కిడ్నాప్ చేశారని వివరించారు.
మంత్రి శ్యామ్‌ను కిడ్నాప్ చేయడానికి ముందు.. నిందితులు శ్యామ్ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్ అద్దెకి తీసుకొని శ్యామ్ మూమెంట్స్ అబ్జర్వ్ చేశారన్నారు. నిందితుల్లో నలుగురు పరారిలో ఉన్నారని డీసీపీ తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 8 మొబైల్స్, రెండు బైక్స్ సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కేసులో మొత్తం పదిమందిని అరెస్టు చేసినట్లు డీసీపీ బాలస్వామి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
Electricity Department: అన్ని జిల్లాల్లో 400 కేవీ సబ్‌స్టేషన్లు
AP Assembly House Committee: వైసీపీ హయాంలో అవినీతిపై 17లోగా నివేదిక