Share News

ABVP Protest: నగరంలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన.. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:12 PM

నగరంలో ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు.

ABVP Protest: నగరంలో ఏబీవీపీ విద్యార్థుల ఆందోళన.. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
Hyderabad Collectorate

హైదరాబాద్: నగరంలో ఏబీవీపీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలంటూ నిరసన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రూ. 8500 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బారికేడ్లు నెట్టుకుంటూ.. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు విద్యార్థులు యత్నించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బలగాలు విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో ABVP నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఏబీవీపీ నేతలను, విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి సైదాబాద్ పీఎస్‌కు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళలకు రాజకీయ అవకాశాలతోనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ అబ్దుల్ నజీర్

భూముల ఆక్రమణకు చెక్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Updated Date - Sep 16 , 2025 | 01:19 PM