Telangana: బ్రాండెడ్ మెడిసినా.. జర భద్రం..
ABN , Publish Date - May 13 , 2025 | 09:36 AM
నిత్యం వినియోగించే 300 రకాల బ్రాండెడ్ ఔషధాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) ప్రజలకు సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీఏ అధికారులు నిర్వహించిన దాడుల్లో 5 రకాల ఔషదాల్లో ...
హైదరాబాద్, మే 13: నిత్యం వినియోగించే 300 రకాల బ్రాండెడ్ ఔషధాల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) ప్రజలకు సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా డీసీఏ అధికారులు నిర్వహించిన దాడుల్లో 5 రకాల ఔషదాల్లో నాణ్యత లేనట్లు గుర్తించారు. వాటిని తదుపరి పరీక్షల కోసం పంపారు. ఔషధాల కవర్లపై క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే, తయారు చేసిన కంపెనీ వివరాలు, తయారీ తేదీ, ఎక్స్‌పైరీ తేదీ వివరాలు తెలుస్తాయన్నారు. సరిగ్గా అవే వివరాలు ఆ ఔషధాల కవర్‌పైన కూడా ఉండాలని, వివరాలు సరిపోలకపోతే నకిలీ ఔషధంగా గుర్తించాలన్నారు. నకిలీ అని తేలితే టోల్ ఫ్రీ నంబరు 18005596969కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
Also Read:
ఒకే లేన్.. మిగతావన్నీ క్లోజ్
ఏపీలో వెలుగులోకి భారీ కుంభకోణం
పాక్ ఉన్మాదం.. భారత్‌పై 15 లక్షల సైబర్ అటాక్స్
For More Telangana News and Telugu News..