Share News

High Court: 66 ఏళ్లు సాగిన ఆస్తి తగాదాపై హైకోర్టు తుది తీర్పు

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:08 PM

వారసుల మధ్య 66 ఏళ్ల పాటు సాగిన ఆస్తి తగాదా కేసులో గురువారం హైకోర్టు(High Court) తుది తీర్పు ఇచ్చింది. నగరానికి చెందిన నవాబ్‌ మొయినుద్దులా బహదూర్‌ కుమార్తె సుల్తానా జహాన్‌ బేగం 1953లో తొలుత ఆస్తుల విభజన కోసం సిటీ సివిల్‌ కోర్టులో సూట్‌ దాఖలు చేశారు.

High Court: 66 ఏళ్లు సాగిన ఆస్తి తగాదాపై హైకోర్టు తుది తీర్పు

- మక్తాపై వివాదానికి ముగింపు

హైదరాబాద్‌: వారసుల మధ్య 66 ఏళ్ల పాటు సాగిన ఆస్తి తగాదా కేసులో గురువారం హైకోర్టు(High Court) తుది తీర్పు ఇచ్చింది. నగరానికి చెందిన నవాబ్‌ మొయినుద్దులా బహదూర్‌ కుమార్తె సుల్తానా జహాన్‌ బేగం 1953లో తొలుత ఆస్తుల విభజన కోసం సిటీ సివిల్‌ కోర్టులో సూట్‌ దాఖలు చేశారు. తర్వాత ఆ పిటిషన్‌ హైకోర్టుకు బదిలీ అయి సివిల్‌ సూట్‌ (సీఎస్‌ ఆఫ్‌ 7)గా నమోదయింది.

ఈ వార్తను కూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు ముగింపు ఎన్నడో..


ఈ కేసులో వారి మధ్య రాజీ కుదుర్చి ఒప్పందం చేసేందుకు హైకోర్టు రాజా కిషన్‌దాస్, నవాబ్‌ సలీంఖాన్‌లను కమిషనర్‌ కం రిసీవర్లుగా నియమించింది. 1959లో ప్రాథమిక డిక్రీ జారీఅయింది. 1966లో భూములు, షేర్లు, ఇతర ఆస్తుల విభజన చేసి విభజన చేసి తుది పంపిణీ స్టేట్‌మెంట్‌ను దాఖలు చేశారు. అయినా ఉనికిలో లేని మక్తా ఆస్తుల కోసం లిటిగేషన్‌ కొనసాగుతోంది.


ప్రాథమిక డిక్రీలో లేని ఆస్తులను తరువాత చేర్చడం కుదరని పేర్కొన్న చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌(Justice NV Sravankumar) ధర్మాసనం.. ఆ కేసును ముగిస్తున్నట్లు పేర్కొంది. 1970 నాటి ఆదేశాల ప్రకారం ఫైనల్‌ డిక్రీని తయారు చేసి ఇవ్వాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై సుప్రీంకోర్టులో ఉన్న ఇతర కేసులపై ఈ తీర్పు ప్రభావం ఉండబోదని స్పష్టంచేసింది.


ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 17 , 2025 | 01:08 PM