Share News

JNTU: జేఎన్‌టీయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు ముగింపు ఎన్నడో..

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:48 PM

జేఎన్‌టీయూ(JNTU) పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియలో అంతులేని జాప్యం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. గతేడాది జనవరిలో పీహెచ్‌డీ అడ్మిషన్ల(PhD Admissions) కోసం వర్సిటీ అధికారులు నోటిఫికేషన్‌ ఇవ్వగా, ఏడాదవుతున్నా ప్రవేశాల ప్రక్రియకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు.

JNTU: జేఎన్‌టీయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు ముగింపు ఎన్నడో..

- నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడాదైనా ముగియని ప్రక్రియ

- ఇంటర్వ్యూలు పూర్తయినా పెండింగ్‌లోనే అడ్మిషన్లు

- ఇండస్ట్రియల్‌, పార్ట్‌టైమ్‌ అభ్యర్థులకు తప్పని ఎదురుచూపులు

హైదరాబాద్‌ సిటీ: జేఎన్‌టీయూ(JNTU) పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియలో అంతులేని జాప్యం అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. గతేడాది జనవరిలో పీహెచ్‌డీ అడ్మిషన్ల(PhD Admissions) కోసం వర్సిటీ అధికారులు నోటిఫికేషన్‌ ఇవ్వగా, ఏడాదవుతున్నా ప్రవేశాల ప్రక్రియకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఇండస్ర్టియల్‌ అభ్యర్థులు, మరికొందరు పార్ట్‌టైమ్‌ అభ్యర్థుల విషయంలో ఉన్నతాధికారులు వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: జంటహత్యల కేసులో వీడిన మిస్టరీ.. వీడియోలు తీయొద్దన్నందుకే దారుణం


పలుమార్లు వర్సిటీ ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నా.. తమ అడ్మిషన్ల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, తమను తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తున్నారంటూ.. బాధిత అభ్యర్థులు మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్టీ కమిషన్‌కు తాజాగా ఫిర్యాదు చేయడం వర్సిటీ వర్గాల్లో కలకలం రేపుతోంది. వాస్తవానికి నోటిఫికేషన్‌ జారీ చేసిన ఆర్నెళ్ల తర్వాత గత జూలైలో ప్రవేశపరీక్ష నిర్వహించగా, అర్హత పొందిన అభ్యర్థులకు అక్టోబరు 3నుంచి 7వ తేదీవరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూల ప్రక్రియ ముగిసిన తర్వాత ప్రకటించిన మెరిట్‌ లిస్టులో తమ పేర్లు ఉన్నప్పటికీ అడ్మిషన్లు ఎందుకు ఇవ్వరంటూ..


వారంతా వర్సిటీ అడ్మిషన్ల విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో పీహెచ్‌డీ ప్రవేశాల ప్రక్రియలో అవతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తుండడమే ప్రక్రియ పూర్తికాకపోవడానికి కారణమని అధికారిక వర్గాలంటున్నాయి. విషయం మానవ హక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్టీ కమిషన్‌ దాకా వెళ్లడంతో అభ్యర్థులు, అధికారుల భవితవ్యం ఎలా ఉండబోతుందోనంటూ.. సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.


కొలిక్కిరాని ‘టీసీ’ల వ్యవహారం..

యూనివర్సిటీలోని అడ్మిషన్ల విభాగం, రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ విభాగాల మధ్య ఇటీవల ఏర్పడిన టీసీల వివాదం ఇంకా పరిష్కారం కాలేదు. గతేడాది మే నుంచి ఇన్‌చార్జి వీసీగా ఉన్న ఐఏఎస్‌ గానీ, గత డిసెంబరులో బాధ్యతలు స్వీకరించిన బాలకిష్టారెడ్డిగానీ ఈ సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. జేఎన్‌టీయూ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు, ఆర్‌అండ్‌డీ విభాగం నుంచి ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఒక సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు మరొక సబ్జెక్ట్‌లో పీహెచ్‌డీ ప్రవేశం పొందాలంటే టీసీ తప్పనిసరి అని అడ్మిషన్ల విభాగం అధికారులు స్పష్టం చేశారు.


ఆర్‌అండ్‌డీ విభాగం సిబ్బంది టీసీలు ఇవ్వకపోవడంతో, పదుల సంఖ్యలో అభ్యర్థులను అడ్మిషన్ల అధికారులు పెండింగ్‌లో పెట్టారు. చివరాఖరికి కొందరు అభ్యర్థులకు టీసీలు లేకున్నా ఇంటర్వ్యూలకు అనుమతించిన అధికారులు, వారి పేర్లను మెరిట్‌ లిస్టులో పెట్టాలా, వద్దా అని సంశయిస్తున్నట్లు తెలిసింది. ఈ సమస్యను ప్రస్తుత ఇన్‌చార్జి వీసీ అయినా పరిష్కరించాలని, ప్రవేశపరీక్ష పాసైన అభ్యర్థులకు పీహెచ్‌డీ అడ్మిషన్లు ఇచ్చే విషయంలో అవసరమైతే నిబంధనలను సడలించాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే

ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 17 , 2025 | 12:48 PM