Hyderabad: జంటహత్యల కేసులో వీడిన మిస్టరీ.. వీడియోలు తీయొద్దన్నందుకే దారుణం
ABN , Publish Date - Jan 17 , 2025 | 12:26 PM
పుప్పాల్‌గూడ(Puppalguda) పద్మనాభస్వామి ఆలయ గుట్టపై జరిగిన జంటహత్యల కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ సెక్స్ వర్కర్‌గా పనిచేస్తోంది.

- ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్ సిటీ: పుప్పాల్‌గూడ(Puppalguda) పద్మనాభస్వామి ఆలయ గుట్టపై జరిగిన జంటహత్యల కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ సెక్స్ వర్కర్‌గా పనిచేస్తోంది. ఆమె వద్దకు రాహుల్‌కుమార్ సాకేత్ వచ్చి వెళ్తుండేవాడు. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వీడియాలు తీసేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో అతడిని బలవంతంగా అక్కడి నుంచి పంపించింది. సదరు మహిళ తనతో కలిసి ఉండే అంకిత్‌కు విషయం చెప్పగా.. అతడు రాహుల్‌కుమార్‌ను హెచ్చరించాడు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాహుల్.. అంకిత్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఇక్కడ.. ఎనీటైం మందు గురూ..
పథకం ప్రకారం పిలిచి..
పథకం ప్రకారం ఈనెల 11వ తేదీన రాహుల్ కుమార్ ఆఫీస్ బాయ్‌గా పనిచేసే రాజ్‌కుమార్ సాకేత్(22), హౌస్ కీపింగ్‌లో పనిచేసే సుకేందర్ కుమార్ సాకేత్ (30)ను తనతో పాటు పుప్పాల్‌గూడ పద్మనాభస్వామి ఆలయం గుట్టపైకి ఆటోలో తీసుకెళ్లాడు. పద్మనాభస్వామి ఆలయం వద్దకు రావాలని రాహుల్ సదరు మహిళను, అంకిత్‌ను ఆహ్వానించాడు. వారు రాగానే మహిళ వద్దకు సుకేందర్ కుమార్ సాకేత్‌ను పంపించారు. రాహుల్ కుమార్ సాకేత్, రాజ్‌కుమార్ సాకేత్‌లు అంకిత్‌ను అక్కడి నుంచి కొంత దూరం తీసుకెళ్లి అతడిని కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపారు.
అనంతరం ఇద్దరూ కలిసి మహిళ వద్దకు వెళ్లారు. ఆమెను కూడా బండరాయితో కొట్టి చంపారు. మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్(Cell Phones)లు తీసుకొని తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌లోని సింధి జిల్లాకు పారిపోయారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మధ్యప్రదేశ్ వెళ్లి నిందితులను అరెస్ట్ చేసి, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై నగరానికి తీసుకొచ్చామని డీసీపీ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Road Accident: తల్లీకుమార్తెను బలిగొన్న పొగమంచు
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా గురించి మంత్రి పొంగులేటి ఏం చెప్పారంటే..
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసా కోసం దరఖాస్తు.. డిప్యూటీ సీఎం చెప్పింది ఇదే
ఈవార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
Read Latest Telangana News and National News