Share News

Hyderabad: పగలు ఎండ.. రాత్రి భారీ వర్షం

ABN , Publish Date - Aug 06 , 2025 | 09:51 AM

నగరంలో మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు రాత్రి కురిసిన వర్షంతో తడిసి ముద్దయ్యారు. రాత్రి 7 గంటల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లింగంపల్లిలో అత్యధికంగా 5.1 సెం.మీ, చందానగర్‌లో 4.4 సెం.మీ వర్షం కురిసింది.

Hyderabad: పగలు ఎండ.. రాత్రి భారీ వర్షం

- లింగంపల్లిలో 5.1 సెం.మీ

- ప్రధాన రహదారులు జలమయం

- ట్రాఫిక్‌తో వాహనదారుల ఇబ్బందులు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో మధ్యాహ్నం వరకు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు రాత్రి కురిసిన వర్షంతో తడిసి ముద్దయ్యారు. రాత్రి 7 గంటల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షంతో ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లింగంపల్లిలో అత్యధికంగా 5.1 సెం.మీ, చందానగర్‌లో 4.4 సెం.మీ వర్షం కురిసింది. రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టుప్రాంతాలు వణికిపోతున్నాయి. జూబ్లీహిల్స్‌, బంజరాహిల్స్‌, షేక్‌పేట, గచ్చిబౌలి, ఖైరతాబాద్‌, మదాపూర్‌, హాఫీజ్‌పేట, మియాపూర్‌, చందానగర్‌(Miyapur, Chandanagar), ఎర్రగడ్డ, యూసు్‌ఫగూడ, బోరబండ, ఫిలింనగర్‌, మణికొండ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో రహదారులపై వరదనీరు భారీగా ప్రవహించింది.


city6.3.jpg

వర్షంతో ఐటీ కారిడార్‌ నుంచి నగరం నలువైపులా వెళ్లే దారుల్లో ట్రాఫిక్‌కు ఆటంకం కలిగింది. రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, జేఎన్‌టీయూ, పంజాగుట్ట, మాదాపూర్‌, కొండాపూర్‌(Madhapur, Kondapur), అమీర్‌పేట, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో రోడ్లపై వరదనీటితో ట్రాఫిక్‌జామ్‌ సమస్యలు తలెత్తి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాయదుర్గం నుంచి మెహిదీపట్నం, నానల్‌నగర్‌, మాసబ్‌ట్యాంక్‌ వెళ్లే మార్గంలోనూ ట్రాఫిక్‌ నెమ్మదిగా ముందుకు సాగింది. అయితే, మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండ 32.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.


ముందస్తు అలర్ట్‌తో..

మంగళవారం సాయంత్రం వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ముందస్తుగా ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేయడంతో ఐటీ ఉద్యోగులు దశల వారీగా లాగవుట్‌ చేసి బయటకు రావడంతో ఐటీ కారిడార్‌లో కొన్ని మార్గాల్లో మాత్రమే ట్రాఫిక్‌ జామ్‌ సమస్యలు తలెత్తాయని పోలీసులు తెలిపారు. ఇదిలాఉండగా.. గ్రేటర్‌ పరిధిలో మరో రెండురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వారు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్‌ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

నేడు, రేపు భారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 06 , 2025 | 09:51 AM