Share News

Water: రేపు ఆ ప్రాంతాలకు గోదావరి నీళ్లు బంద్‌..

ABN , Publish Date - Apr 11 , 2025 | 08:25 AM

హైదరాబాద్ మహానగరంలోని కొన్ని ప్రాంతాలకు శనివారం గోదావరి జలాలు పంపిణీ కావని సంబంధిత అధికారులు తెలిపారు. పైప్‏లైన్ మరమ్మతులు, ఇతర కారణాల వల్ల రేపు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Water: రేపు ఆ ప్రాంతాలకు గోదావరి నీళ్లు బంద్‌..
Water Supply

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ మహా నగర దాహార్తిలో కీలకంగా ఉన్న గోదావరి జలాలు(Godavari waters) శనివారం పలు ప్రాంతాలకు నిలిచిపోనున్నాయి. గోదావరి డ్రింకింగ్‌ వాటర్‌ సప్లై పథకంలో భాగంగా హైదర్‌నగర్‌ నుంచి అల్వాల్‌(Hydernagar to Alwal) వరకు ఉన్న 1200 ఎంఎం డయా ఎంఎస్‌ గ్రావిటీ మెయిన్‌ పైపులైనుకు షాపూర్‌నగర్‌ వద్ద మరమ్మతు పనులు చేయనున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రేపు దుకాణాలు బంద్‌


శనివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ పనులు చేపట్టనున్నారు. ఈ 15 గంటల పాటు వాటర్‌బోర్డు ఆపరేషన్‌ మెయింటనెన్స్‌ డివిజన్‌-12 పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు ప్రకటించారు.


city3.2.jpg

ముఖ్యంగా షాపూర్‌నగర్‌, సంజయ్‌ గాంధీనగర్‌(Shahpur Nagar, Sanjay Gandhi Nagar), కలావతినగర్‌, హెచ్‌ఎంటీ సొసైటీ, హెచ్‌ఏఎల్‌ కాలనీ, టీఎస్‌ఐఐసీ కాలనీ, రోడమేస్ర్తి నగర్‌, శ్రీనివాస్‌ నగర్‌, ఇందిరానగర్‌, గాజులరామారం, శ్రీసాయి హిల్స్‌, దేవేందర్‌ నగర్‌, కైలాస్‌ హిల్స్‌, బాలాజీ లేఅవుట్‌, కైసర్‌నగర్‌ తదితర ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Adilabad: కన్నీటి కష్టాలు

గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించాలి

పేదలకు మూడు రంగుల కార్డులు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 11 , 2025 | 10:04 AM