గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:27 PM
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు.
- సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి
- చమురు ధరల పెంపుపై నాయకుల నిరసన
నారాయణపేట/మక్తల్/ దామరగిద్ద, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నారాయణపేట అంబేడ్కర్ చౌరస్తాలో గ్యాస్ సిలిండర్‌తో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గితే ఏ దేశంలోనైనా గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గుతాయని కానీ భారతదేశంలో మాత్రం భిన్నంగా ధరలు పెంచారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో రూ.400 ఉన్న గ్యాస్ నేడు వెయ్యి రూపాయలకు చేరిందన్నారు. కార్యక్రమంలో గోపాల్, అం జిలయ్యగౌడ్, కాశప్ప, దస్తప్ప, ప్రకాశ్, భీంశప్ప, మల్లేష్, గోవింద్, రాములు, పవన్, రాజేశ్వరి తదితరులున్నారు.
అదేవిధంగా, మక్తల్ తహసీల్దార్ కార్యాల యం ముందు సీపీఐఎంఎల్ మాస్‌లైన్, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీవోడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు శా రద మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వంటగ్యాస్, చమురు ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నారని వాపోయారు. అనంతరం తహసీల్దార్ సతీష్‌కు వినతిపత్రం అందించారు. పీవోడబ్ల్యూ, పీవైఎల్ నాయకులు మహాదేవి, రాములమ్మ, బోయ నర్సమ్మ, మల్లేశ్, గోపాల్, ఆనంద్ పాల్గొన్నారు.
దామరగిద్ద మండల కేంద్రంలోని సంత బజార్‌లో సీపీఐఎంఎల్ మాస్‌లైన్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకుడు పెద్దింటి రామకృష్ణ, మండల నాయకులు తాయప్ప, మధు, మహేష్‌లు మా ట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని, లేకపోతే పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్రమోదీ విధా నాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎం.రాజు, భాస్కర్, లడ్డి రాజు, కృష్ణ, రాజ్‌కుమార్, అంజి, కర్రెప్ప, మాణిక్యప్ప, శ్యామ్‌కుమార్, వసంతమ్మ, బుగ్గమ్మ తదితరులున్నారు.