Hyderabad: మద్యం ప్రియులకో బ్యాడ్ న్యూస్.. రేపు దుకాణాలు బంద్
ABN , Publish Date - Apr 11 , 2025 | 07:13 AM
మద్యం ప్రియులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూసే. రేపు శనివారం దుకాణాలు మూసివేయబడతాయి. శనివారం 12వతేదీ ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.

- హనుమాన్ జయంతి సందర్భంగా..
హైదరాబాద్ సిటీ: హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా శనివారం మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్(Greater Hyderabad)లోని ట్రై కమిషనరేట్ల పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభాయాత్ర(Veera Hanuman Shobhayatra))లు జరగనున్నాయి. ముందు జాగ్రత్తగా శనివారం 12వతేదీ ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: హైడ్రాతో రియల్ ఎస్టేట్ పడిపోలేదు
ఈ వార్తలు కూడా చదవండి:
గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలి
Read Latest Telangana News and National News