Share News

Road Accident: బంధువుల పెళ్లికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు

ABN , Publish Date - Aug 16 , 2025 | 04:05 AM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టిన ఘటన లో నలుగురు మృతిచెందారు.

Road Accident: బంధువుల పెళ్లికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు

  • రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

  • జడ్చర్ల వద్ద హైవే పై ఘటన

  • లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు

  • నంద్యాలలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

జడ్చర్ల, రాయపర్తి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున లారీని ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టిన ఘటన లో నలుగురు మృతిచెందారు. 13 మంది గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప నుంచి సీజీఆర్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు సుమారు 35 మంది ప్రయాణికులతో గురువారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌, మియాపూర్‌ ప్రాంతాలకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తూ ఈ బస్సు ఎక్కారు. వీరిలో డ్రైవర్‌ సీటు వెనుకభాగంలో కూర్చున్న వరుసకు అత్తాకోడళ్లు అయిన లక్ష్మీదేవి(60), రాధిక(48)లు సీట్ల మధ్య ఇరుక్కొని మృతి చెందారు. బస్సు డ్రైవర్‌ నరసింహ(50) తలకు పదునైన వస్తువు తగలడంతో తల తెగిపడింది. తీవ్రంగా గాయపడి జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కడప పట్టణానికి చెందిన నరసింహ(25) మృతి చెందారు. మరో ప్రమాదం వరంగల్‌ జిల్లాలో జరిగింది. రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారులో ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న కంటైనర్‌ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు 22 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


ముగ్గురిని కబళించిన రహదారి

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఆల్ఫా ఇంజనీరీంగ్‌ కళాశాల వద్ద శుక్రవారం తెల్లవారుజామున రెండు ప్రైవేటు బస్సులు ఢీ కొనడంతో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. 27 మందికి గాయపడ్డారు. జగన్‌ ట్రావెల్స్‌ బస్సు, శ్రీ కృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శ్రీకృష్ణ ట్రావెల్‌ బస్సులో ప్రయాణిస్తున్న అనకాపల్లి జిల్లా గునుపుడి గ్రామానికి చెందిన కుసరాజు(25), జగన్‌ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న ఇంజినీరింగ్‌ విద్యార్థులు రాజమండ్రికి చెందిన వెంకటసాయి(22), సరూర్‌ నగర్‌కు చెందిన అనంత గౌతమ్‌(23) అక్కడికక్కడే మృతి చెందారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్‌భవన్‌‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు

ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత

ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 04:05 AM