Farmers: యూరియా కోసం ఇక్కట్లు
ABN , Publish Date - Aug 09 , 2025 | 04:39 AM
ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నంగునూరు/మద్దూరు/జహీరాబాద్/బెజ్జంకి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కోసం రైతులు క్యూ కడుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకు సహకార సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారక ముందే వచ్చినా అక్కడికి చేరుకున్న రైతులు తమ వంతు కోసం చెప్పులను క్యూలో పెట్టారు. తెల్లవారక ముందే వచ్చినా ఒక్క బస్తా కూడా చేతికి అందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మద్దూరు మండలంలోనూ స్థానిక సొసైటీ వద్ద శుక్రవారం ఉదయయే రైతులు యూరియా కోసం క్యూ కట్టారు. ఇదే జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో పీఏసీఎస్ ఎదుట రైతులు యూరియా కోసం బారులు దీరారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో యూరియా కోసం రైతులు దుకాణాల వద్ద కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News