Share News

Trains: చర్లపల్లి-కాకినాడ, నాందేడ్‌-తిరుపతి వీక్లీ స్పెషల్‌ రైళ్ల పొడిగింపు

ABN , Publish Date - Aug 15 , 2025 | 06:47 AM

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ నాందేడ్‌-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్‌ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Trains: చర్లపల్లి-కాకినాడ, నాందేడ్‌-తిరుపతి వీక్లీ స్పెషల్‌ రైళ్ల పొడిగింపు

హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి-కాకినాడ(Cherlapalli-Kakinada), నాందేడ్‌-తిరుపతి మధ్య వీక్లీ స్పెషల్‌ రైళ్లను పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-కాకినాడ టౌన్‌ (07031) ప్రత్యేక రైలు ఈనెల 15, 22, సెప్టెంబర్‌ 2వ తేదీ(శుక్ర వారం)వరకు,


city1.2.jpg

కాకినాడ టౌన్‌-చర్లపల్లి(Kakinada Town-Cherlapalli) (07032) ప్రత్యేక రైలు ఈనెల 17, 24, 31 తేదీ(ఆదివారం)వరకు, హెచ్‌ఎస్‌.నాందేడ్‌-తిరుపతి (07015) ప్రత్యేకరైలు (ప్రతి శనివారం) 2026 మార్చి 28వరకు, తిరుపతి-హెచ్‌ఎస్‌.నాందేడ్‌ (07016) ప్రత్యేక రైలు( ప్రతి ఆదివారం) మార్చి 29, 2026 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు.


city1.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2025 | 06:47 AM