Share News

CP CV Anand: నిమజ్జనం రోజు నిర్లక్ష్యం వద్దు..

ABN , Publish Date - Sep 02 , 2025 | 07:38 AM

గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు.. నిర్వాహకులు స్థానిక పోలీసులకు సహకరించాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించొద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ సూచించారు. సోమవారం వెస్టుజోన్‌ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్‌, బంజారాహిల్స్‌, మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని గణేశ్‌ మండపాలను సీపీ సీవీ ఆనంద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

CP CV Anand: నిమజ్జనం రోజు నిర్లక్ష్యం వద్దు..

- సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ: గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు.. నిర్వాహకులు స్థానిక పోలీసులకు సహకరించాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించొద్దని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(Police Commissioner CV Anand) సూచించారు. సోమవారం వెస్టుజోన్‌ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్‌, బంజారాహిల్స్‌, మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలోని గణేశ్‌ మండపాలను సీపీ సీవీ ఆనంద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం మధురానగర్‌ పోలీస్ స్టేషన్‌(Mathuranagar Police Station)లో వెస్టుజోన్‌ డీసీపీ ఆధ్వర్యంలో లా అండ్‌ ఆర్డర్‌, ట్రాఫిక్‌ సిబ్బందితో సీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు.


city4.2.jpg

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నిమజ్జనం రోజున పోలీస్‌ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలు, బందోబస్తుపై దిశా నిర్దేశం చేశారు. మహిళలు, చిన్నారులకు ఇబ్బందులు కలగకుండా మఫ్టీలో షీ టీమ్స్‌ను రంగంలోకి దింపాలన్నారు. గణేశ్‌ విగ్రహాలను నిమజ్జనం కోసం త్వరగా తరలించేందుకు అవసరమైన కార్యాచరణ, ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సీపీ సూచించారు. ఈ సమావేశంలో వెస్టుజోన్‌ విజయ్‌కుమార్‌, ఎస్‌బీ డీసీపీ అపూర్వ రావు, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే, టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ ఇక్బాల్‌ సిద్దిఖీ, వెస్టు జోన్‌ అడిషనల్‌ డీసీపీ, ఏసీపీలు ఇన్‌స్పెక్టర్‌లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరోగ్యానికి తీపి కబురు

పడిగాపులు.. తోపులాటలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 02 , 2025 | 07:38 AM