CM Revanth Reddy: 30 నెలల్లో మీరాలం వంతెన
ABN , Publish Date - Feb 09 , 2025 | 03:39 AM
మీరాలం చెరువుపై నిర్మించనున్న వంతెన హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పురపాలకశాఖ అధికారులకు సూచించారు.

హైదరాబాద్‌కే తలమానికంగా ఉండాలి
చిన్నారుల కోసం వంతెన పరిసరాలను ఆహ్లాదంగా రూపొందించండి
పురపాలకశాఖ అధికారుల సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): మీరాలం చెరువుపై నిర్మించనున్న వంతెన హైదరాబాద్ నగరానికే తలమానికంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పురపాలకశాఖ అధికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు సంబంధించిన పనులపై పురపాలకశాఖ ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో శనివారం సీఎం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మీరాలం చెరువు వద్ద నిర్మించే వంతెనకు సంబంధించి డీపీఆర్‌ను 90 రోజుల్లో పూర్తిచేయాలని ఆదేశించారు. 30 నెలల్లో వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయాలని, హైదరాబాద్‌లో అత్యంత ప్రముఖ ప్రాంతంగా మీరాలం వంతెనను తీర్చిదిద్దాలని సూచించారు.
చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని వంతెన పరిసరాలను ఆహ్లాదంగా రూపొందించాలని ఆదేశించారు. 2.425 కి.మీ వంతెన నిర్మాణం కోసం మూడు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మిస్తున్న వంతెనల మీద లోతుగా అధ్యయనం చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆదేశించారు. రహదారుల విస్తరణపై పలు సూచనలు చేశారు. రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్‌కు సీఎం ఘన నివాళులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): దేశానికి మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతించారు. శనివారం ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో జాకీర్ హుస్సేన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, మల్లు రవి, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
MLC Kavitha: కాంగ్రెస్ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు
Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ
Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News And Telugu News