CM Revanth Reddy: వ్యవస్థల్ని నియంత్రిస్తే ఊరుకోం
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:01 AM
సినీ పరిశ్రమలో వ్యక్తులు.. వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
అందరూ చట్టపరిధిలో పని చేయాల్సిందే
సినీ నిర్మాతలు, దర్శకులతో సీఎం రేవంత్‌రెడ్డి
అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా
ఇలాంటి పరిస్థితుల్లో వివాదాలు ఉండకూడదు
త్వరలో సినీ కార్మికులను పిలిచి మాట్లాడతా
స్కిల్ యూనివర్సిటీలో సినీ పరిశ్రమకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం: సీఎం రేవంత్
హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): సినీ పరిశ్రమలో వ్యక్తులు.. వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందరూ చట్టపరిధిలో పనిచేయాల్సిందేనని తేల్చిచెప్పారు. తెలుగు సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో ఉంచడమే తన ధ్యేయమని చెప్పారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలుగు సినీ నిర్మాతలు, దర్శకులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు పర్యవేక్షణ అవసరమని, ఇండస్ట్రీకి ఏం కావాలనే దానిపై ఒక కొత్త పుస్తకం రాసుకుందామని అన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోందని, తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలని సూచించారు. తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీలో వివాదం ఉండకూడదనే కార్మికుల సమ్మె విషయంలో తాను చొరవ చూపించానని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమలోని కార్మికులతోనూ మాట్లాడతానన్నారు. అయితే కార్మికుల పట్ల నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని, ఈ విషయంలో సంస్కరణలు అవసరమని సీఎం అభిప్రాయపడ్డారు.
కార్మికులు, నిర్మాతలను తమ ప్రభుత్వం కాపాడుకుంటుందని, వారితోపాటు ప్రభుత్వమూ కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందని పేర్కొన్నారు. పరిశ్రమకు కొత్తగా వచ్చేవారిలో నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ఇక సినిమా పరిశ్రమ కోసం స్కిల్ యూనివర్సిటీలో అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కాగా, ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం చెప్పినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు, నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురే్‌షబాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని తదితరులతోపాటు దర్శకులు త్రివిక్రమ్, బోయపాటి శ్రీనివాస్, సందీ్‌పరెడ్డి వంగా, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News