Share News

CM Revanth Reddy: దళితుడిని ప్రతిపక్ష నేతను చేయండి

ABN , Publish Date - May 16 , 2025 | 03:03 AM

కేటీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్‌రావు చెప్పడంలో అర్థం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారి కుటుంబంలో ఎవరి నాయకత్వమైనా తేడా ఏముంటుందని ప్రశ్నించారు.

CM Revanth Reddy: దళితుడిని ప్రతిపక్ష నేతను చేయండి

  • కేసీఆర్‌ కుటుంబంలో ఎవరి నాయకత్వమైనా.. తేడా ఏముంటుంది..?: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 15(ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్‌రావు చెప్పడంలో అర్థం లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారి కుటుంబంలో ఎవరి నాయకత్వమైనా తేడా ఏముంటుందని ప్రశ్నించారు. బిల్లా అయినా.. రంగా అయినా తేడా ఏమీ లేదన్నారు. అదే కొప్పుల ఈశ్వర్‌, రసమయి బాలకిషన్‌.. లేదా మరొకరి నాయకత్వంలోనో పనిచేస్తానని హరీశ్‌రావు చెబితే బాగుంటుందని తెలిపారు. బుధవారం రాత్రి జలసౌధలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష అనంతరం రేవంత్‌ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు.


తెలంగాణకు దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పారు కాబట్టి.. ఇప్పుడు దళితుడికి నాయకత్వం ఇస్తే మేలని అన్నారు. కేసీఆర్‌ ఎలాగూ అసెంబ్లీకి రావట్లేదని, ఈ నేపథ్యంలో ఓ దళిత ఎమ్మెల్యేకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే బాగుంటుందని చెప్పారు. దళితులకు నాయకత్వం ఇవ్వడమే కాకుండా వారికి కేసీఆర్‌ కుటుంబం విధేయతతో ఉండాలని అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను పెట్టిన తాము.. గాంధీ కుటుంబంతో సమానంగా ఆయనకు గౌరవం ఇస్తున్నామని రేవంత్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Rahul Gandhi: రాహుల్‌పై చర్యలకు రంగం సిద్ధం..

Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్‌‌ను భారత్‌కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..

Supreme Court: సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్‌కు చుక్కెదురు

For Telangana News And Telugu News

Updated Date - May 16 , 2025 | 03:04 AM