Beer Price Hike: బీర్ల ధరలు 15% పెంపు..
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:33 AM
వేసవిలో చల్లటి బీర్లు ప్రియం కానున్నాయి. బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.
ధరల నిర్ణయ కమిటీ సిఫారసులను ఆమోదించిన ప్రభుత్వం
నేటి నుంచే అమల్లోకి కొత్త ధరలు
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): వేసవిలో చల్లటి బీర్లు ప్రియం కానున్నాయి. బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. చివరిసారిగా మూడేళ్ల క్రితం ధరలు పెరిగాయి. అయితే రెండేళ్లకోసారి ధరలను పెంచాలని ఎక్సైజ్ చట్టం చెబుతోంది. గత ఏడాది కాలంగా పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీ వేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ దీనిపై అధ్యయనం చేసింది.
గతంతో పోలిస్తే పెరిగిన ముడిసరుకుల ధరలు, ఉత్పత్తిదారుల విజ్ఞప్తులు, పక్క రాష్ట్రాల్లో ధరలను అధ్యయనం చేసిన కమిటీ.. ఇటీవలే ప్రభుత్వానికి నివేదిక అందించింది. ప్రస్తుత ధరలపై 15 శాతం పెంచవచ్చని కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. కొత్త ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వస్తాయని ఎక్పైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే బీర్ల ధరలను సాధారణంగా 15 శాతం పెంచాక దగ్గరి రూపాయికి సవరిస్తారు. ఉదాహరణకు.. రూ.172.5 ఉన్న బీరు ధరను రూ.173 చేయవచ్చు. లేదా రూ.175గా ఖరారు చేయవచ్చు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.
బీర్ల ధరలు (రూపాయల్లో)..
బీరు ప్రస్తుత ధర - కొత్త ధర
కేఎఫ్ లైట్ - 150 - 172.5
కేఎఫ్ ప్రీమియం - 160 - 184
హేవార్డ్స్ - 160 - 184
టూబర్గ్ లైట్ - 185 - 212.75
కేఎఫ్ అల్ర్టా - 210 - 241.5
బడ్వైజర్ లైట్ - 210 - 241.5
కేఎఫ్ అల్ర్టా మ్యాక్స్ - 220 - 253
బడ్వైజర్ మ్యాగ్నం - 220 - 253
టూబర్గ్ స్ట్రాంగ్ - 240 - 276
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News