Share News

Good News: సొంతూరు వెళ్తున్నారా.. సూపర్ గుడ్ న్యూస్

ABN , Publish Date - Dec 14 , 2025 | 07:32 PM

పండగలు వస్తున్నాయి. పిల్లల స్కూళ్లకు సెలవులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లా పాపలతో ఊళ్లు వేళ్లేందుకు అంతా సిద్దమవుతున్నారు. అలాంటి వేళ.. వారికి గుడ్ న్యూస్

Good News: సొంతూరు వెళ్తున్నారా.. సూపర్ గుడ్ న్యూస్

హైదరాబాద్, డిసెంబర్ 14: సంక్రాంతి పండగ వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. ఇక ఆర్టీసీ బస్సుల్లో సైతం రిజర్వేషన్లు పూర్తయ్యాయి. ఈ పండగ వేళ.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటికి సైతం రిజర్వేషన్ చేయించుకునేందుకు ప్రయాణికులు క్యూ కట్టారు. దాంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో సీట్లు, బెర్తులు దొరకని పరిస్థితి నెలకొంది. అలాంటి వేళ.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అదనంగా 41 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. ఏయే రోజుల్లో.. ఏ మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయో.. వివరాలను తెలిపింది.


ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్లు.. ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ 14వ తేదీ నుంచి చేయించుకోవచ్చని ప్రయాణికులకు సూచించింది. వీటిలో అధిక శాతం రైళ్లు.. సికింద్రాబాద్, వికారాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతికి ఉన్నాయి. ఈ రైళ్లు అన్నీ జనవరి 8 నుంచి 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని వివరించింది.

  • జనవరి 8: కాకినాడ - వికారాబాద్ (07263)

  • జనవరి 9: వికారాబాద్- కాకినాడ (07264)

  • జనవరి 10: కాకినాడ- సికింద్రాబాద్ ( 07279)

  • జనవరి 11: సికింద్రాబాద్- కాకినాడ (07280)

  • జనవరి 9, 11, 13 తేదీల్లో సికింద్రాబాద్- కాకినాడ (07261)

  • జనవరి 10, 12 తేదీల్లో కాకినాడ- సికింద్రాబాద్ (07262)

  • 10, 12 తేదీల్లో వికారాబాద్ - కాకినాడ (07271)

  • జనవరి 9 తేదీ: తిరుపతి - వికారాబాద్ (07265)

  • జనవరి 11వ తేదీ: కాకినాడ - వికారాబాద్ (07272)

  • జనవరి 12వ తేదీ: సికింద్రాబాద్- కాకినాడ (07273)


మరిన్ని ప్రత్యేక రైళ్లు..

  • జనవరి 10,12 తేదీల్లో.. వికారాబాద్ కాకినాడ (07271)

  • 11వ తేదీ : కాకినాడ వికారాబాద్ (07272)

  • 12వ తేదీ: సికింద్రాబాద్ కాకినాడ (07273)

  • 17వ తేదీ: కాకినాడ లింగంపల్లి (07261)

  • 18వ తేదీ: వికారాబాద్ కాకినాడ (07262)

  • 18వ తేదీ: కాకినాడ వికారాబాద్ (07255)

  • 19వ తేదీ: వికారాబాద్ కాకినాడ (07266)

  • 19వ తేదీ: కాకినాడ వికారాబాద్ (07261)

  • 20వ తేదీ: వికారాబాద్ కాకినాడ (07262)


మరిన్ని రైళ్లు అదనంగా..

  • జనవరి 9, 11 తేదీల్లో వికారాబాద్ నర్సాపూర్ (07244)

  • జనవరి 10వ తేదీ: నర్సాపూర్ వికారాబాద్(07245)

  • జనవరి 12వ తేదీ: నర్సాపూర్ సికింద్రాబాద్ (07246)

  • అలాగే జనవరి 9,13 తేదీల్లో సికింద్రాబాద్ నర్సాపూర్ (07247)

  • జనవరి 9 నుంచి 13 వరకు నర్సాపూర్ వికారాబాద్ (07248/07250/07254)

  • జనవరి 10 నుంచి 12 వరకు వికారాబాద్ నర్సాపూర్ (07249/07251/07253)

  • జనవరి 17 నుంచి 19 వరకు నర్సాపూర్ లింగంపల్లి (07257/07258/07259)

  • జనవరి 18, 20 తేదీల్లో వికారాబాద్ నర్సాపూర్ (07258) నడపనుంది.


వీక్లీ ప్రత్యేక రైళ్లు సైతం పొడిగింపు: వివిధ రైల్వే స్టేషన్ల మధ్య ఇప్పటికే నడుస్తున్న వీక్లీ ప్రత్యేక రైళ్లను సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని మరికొన్ని వారాలు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

  • జనవరి 4, 11, 18 తేదీల్లో సికింద్రాబాద్ - అనకాపల్లి (07041)

  • జనవరి 5, 12, 19 తేదీల్లో అనకాపల్లి సికింద్రాబాద్ (07042)

  • జనవరి 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్ గోరఖ్‌పూర్ (07075)

  • జనవరి 11, 18, 25 తేదీల్లో గోరఖ్‌పూర్ - హైదరాబాద్ (07076)


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీ బయలుదేరనున్న మంత్రి లోకేశ్

దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?

For More AP News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 07:59 PM