AP Minister Nara Lokesh: ఢిల్లీ బయలుదేరనున్న మంత్రి లోకేశ్
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:43 PM
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు.
అమరావతి, డిసెంబర్ 14: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. సోమవారం అంటే.. డిసెంబర్ 15వ తేదీన ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. కేంద్ర ఐటీ, రైల్వే శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో మంత్రి నారా లోకేశ్ వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఏపీకి చెందిన పలు సమస్యలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రుల దృష్టికి లోకేశ్ తీసుకెళ్లనున్నారు. అలాగే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సైతం లోకేశ్ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఉదయం విజయవాడ నుంచి ఢిల్లీకి మంత్రి లోకేశ్ చేరుకోనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మంత్రి నారా లోకేశ్.. న్యూఢిల్లీ నుంచి నేరుగా విశాఖపట్నం చేరుకోనున్నారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగే పలు కార్యక్రమాల్లో మంత్రి నారా లోకేశ్ పాల్గొనున్నారు.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు సైతం డిసెంబర్ 19వ తేదీన న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. అందుకోసం డిసెంబర్ 18వ తేదీ సాయంత్రం విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకుంటారు. ఆ రాత్రి పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నట్లు సమాచారం. అలాగే ఆ మరునాడు సైతం పలువురు కేంద్ర మంత్రులను కలిసి.. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పథకాలు అమలు కోసం ఆర్థిక సాయం తదితర అంశాలను వారి దృష్టికి సీఎం చంద్రబాబు తీసుకు వెళ్తారని తెలుస్తోంది. అదీకాక డిసెంబర్ 19వ తేదీ పార్లమెంట్ శీతకాల సమావేశం ఆఖరి రోజు. దీంతో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?
For More AP News And Telugu News