Naxalites: 19 మంది నక్సల్స్ ఎన్‌కౌంటర్
ABN , Publish Date - May 08 , 2025 | 03:51 AM
ఆపరేషన్ కర్రెగుట్టలు’ 16వ రోజైన బుధవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ కాల్పు లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది నక్సలైట్లు మృతి చెందా రు. వీరంతా తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందినవారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు.

కర్రెగుట్టల్లో తుపాకుల గర్జన
మృతుల్లో 8 మంది మహిళలు
వీరంతా తెలంగాణ కమిటీ వారే!
ఏవోబీలో జోనల్ కమిటీ నేత జగన్, డీసీఎం నేత రమేశ్ కాల్చివేత
చర్ల/ములుగు మే 7(ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్ కర్రెగుట్టలు’ 16వ రోజైన బుధవారం మావోయిస్టులు, పోలీసులకు మధ్య భారీ కాల్పు లు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 19 మంది నక్సలైట్లు మృతి చెందా రు. వీరంతా తెలంగాణ రాష్ట్ర క్యాడర్‌కు చెందినవారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. ఘటనాస్థలిలో తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే.. ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ మృతిచెందినట్లు ప్రచారం జరుగుతున్నా.. ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించలేదు. కాగా.. ఆంధ్ర-ఒడిసా సరిహద్దుల్లోని జీకేవీధి ఏజెన్సీలో పోలీసులు-మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి.
ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి పండన్న అలియాస్ జగన్, ఒడిసాలోని మల్కన్‌గిరి డీసీఎం నేత రమేశ్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరోవైపు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట కొమటిపల్లి ఆర్పీసీ(రెవెల్యూషనరి పీపుల్ కమిటీ)కి చెందిన ఐదుగురు నక్సలైట్లు బుధవారం లొంగిపోయారు. వీరిలో మాడ్వి భీమా, మాడ్వి కోస, భీమా, వంజం ఊర, వంజం హుంగి ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ దాడికి ముందు..దాడి తర్వాత ఎలా ఉందంటే..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై..సచిన్, సెహ్వాగ్ సహా పలువురి క్రీడా ప్రముఖుల స్పందన
Bank of Baroda Recruitment: టెన్త్ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు..నెలకు రూ.37 వేల జీతం
Read More Business News and Latest Telugu News