YouTube Changing Shorts: క్రియేటర్లకు తెలియకుండానే షార్ట్ వీడియోలను మార్చుతున్న యూట్యూబ్..ఎందుకో తెలుసా..
ABN , Publish Date - Aug 27 , 2025 | 08:16 PM
క్రియేటర్లకు తెలియకుండానే యూట్యూబ్.. షార్ట్ వీడియోలను మార్చేస్తోందని ఊహించగలరా? ఇది కేవలం టెక్నికల్ గ్లిచ్ కాదు. ఒక వ్యూహాత్మక మార్పు అని తెలుస్తోంది. వీడియోల ఫార్మాట్, మ్యూజిక్, ఎడిట్‌లను యూట్యూబ్ స్వయంగా ట్యూన్ చేస్తుందంటా. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ అంటే తెలియనివారుండరు. ఎంతోమంది క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ టాలెంట్ చూపించేందుకు, డబ్బు సంపాదించేందుకు ఈ ప్లాట్‌ఫాం మీద ఆధారపడుతున్నారు. ముఖ్యంగా YouTube Shorts ట్రెండ్ అయిపోయింది. రోజుకు 200 బిలియన్లకు పైగా వ్యూస్ వస్తున్నాయంటే మామూలు విషయం కాదు.
అయితే ఈ మధ్య ఓ విషయమై క్రియేటర్ల మధ్య చర్చలు, అసంతృప్తి మొదలయ్యాయి. యూట్యూబ్ ఏఐ ఆధారిత మార్పులు చేస్తున్నా వాటి గురించి ఎవరికీ ముందుగా చెప్పడం లేదు. షార్ట్ వీడియోలు అప్‌లోడ్ చేసిన తర్వాత, వాటిలో చిన్నచిన్న మార్పులు జరిగినట్టు చాలా మంది గుర్తించారు. కానీ అవి మనమే చేయలేదు కదా అని ఆశ్చర్యపోతున్నారు.
AI మార్పులు అంటే ఏంటి?
ఈ మార్పులు పెద్దవేమీ కావు. కానీ గమనించదగినవే. యూట్యూబ్ క్రియేటర్ రీన్ రిచీ చెబుతున్నట్లుగా AI టెక్నాలజీ వీడియోని unblur, denoise చేసి స్పష్టతను పెంచే పనిలో పడింది. అంటే మసకబారిన దృశ్యాలు స్పష్టంగా చూపించడం, శబ్దాన్ని తగ్గించడం వంటివి. ఇవి చూస్తే బావుంటాయి. మన వీడియో క్లారిటీ పెరుగుతుందే అనిపించొచ్చు. కానీ అసలు సమస్య ఏమిటంటే, ఇది క్రియేటర్‌కు తెలియకుండా జరుగుతోంది.
క్రియేటర్లలో అసంతృప్తి ఎందుకు?
యూట్యూబ్ ఇవన్నీ చేయడం మానుకోలేదు. కానీ ముందుగానే ఇలా చేస్తున్నాం అని చెప్పకపోవడమే ఇప్పుడు డిస్కషన్ టాపిక్ అయింది. కంటెంట్ మీద మానవీయమైన టచ్, ఓ వ్యక్తి శ్రమ, క్రియేటివిటీ ఉంటుంది. ఆ వీడియోపై యూట్యూబ్ మార్పులు చేస్తే, ఆ క్రియేటర్‌కు చెప్పకుండా చేస్తే, ఆ వ్యక్తి ప్రాముఖ్యత ఏమవుతుంది. యూట్యూబ్ ఈ AI టెస్టులు చాలా రోజులుగానే చేస్తోందట. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎవరికి అప్డేట్ చేయలేదు.
భవిష్యత్తులో Veo 3 AIతో మరిన్ని మార్పులు?
ఇంకా ఆసక్తికర విషయం ఏమిటంటే గూగుల్ తన కొత్త Veo 3 AI మోడల్ని YouTube Shortsలో తీసుకురానుంది. ఇది ఏం చేస్తుందంటే టెక్స్ట్ ప్రాంప్ట్ ఆధారంగా వీడియోనే తాయారుచేస్తుంది. మనం షూట్ చేయకుండా, స్క్రిప్ట్ రాయకుండా వీడియో క్రియేట్ చేయవచ్చు. ఇది 2025 చివర్లో విడుదలయ్యే అవకాశముంది.
AI మంచిదే.. కానీ పారదర్శకత ముఖ్యం
AI వల్ల మనం టైం, శ్రమ బాగా ఆదా చేసుకోవచ్చు. కానీ కీలక విషయం ఏంటంటే, క్రియేటర్ పర్మిషన్ లేకుండా వీడియోలో మార్పులు చేయడం. అది నైతికంగా సరిగ్గా అనిపించట్లేదనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. యూట్యూబ్ కంటెంట్ మారుస్తోంది అంటే, క్రియేటర్ ప్లాట్‌ఫాం మధ్య నమ్మకం దెబ్బతినే ప్రమాదం ఉంది. AI ఉపయోగించాలంటే, ముందే తెలియజేయడం మంచిది కదా అనే అభిప్రాయం అనేక మంది నుంచి వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి