Google Alert: వినియోగదారులకు గూగుల్ అప్‌డేట్.. మీ సేఫ్టీ కోసం ఇలా చేయండి
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:32 PM
జీమెయిల్ యూజర్లకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే మీ జీమెయిల్ ఖాతా భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని, పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలని గూగుల్ 2.5 బిలియన్ యూజర్లకు సూచించింది. ఎందుకనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
మీరు జీమెయిల్ వినియోగిస్తున్నారా. అయితే ఈ వార్త గురించి తప్పక సమాచారం తెలుసుకోవాలి. ఎందుకంటే గూగుల్ తాజాగా దాదాపు 2.5 బిలియన్ల మంది వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇటీవల జరిగిన పెద్ద సైబర్ దాడి వల్ల, అనేక వినియోగదారుల ఖాతాలు ప్రమాదంలో ఉన్నాయని గూగుల్ తెలిపింది. ఈ సైబర్ దాడి Salesforce అనే థర్డ్ పార్టీ డేటా లీక్‌తో సంబంధం కలిగి ఉందని గుర్తు చేసింది. ఈ లీక్ కారణంగా హ్యాకర్లకు వినియోగదారుల అకౌంట్‌లను దుర్వినియోగం చేయడానికి కొత్త అవకాశాలు లభించాయని వెల్లడించింది.
సెక్యూరిటీని పెంచుకోవాలి
గూగుల్ తెలిపినట్లుగా, ఈ డేటా బ్రీచ్ (data breach) కారణంగా, జీమెయిల్, గూగుల్ క్లౌడ్, ఇతర గూగుల్ సేవల వినియోగదారులకు తీవ్ర ప్రమాదం ఏర్పడింది. హ్యాకర్లు ఈ సమాచారాన్ని ఉపయోగించి, వినియోగదారుల ఖాతాలకు యాక్సెస్ చేసేందుకు ఫిషింగ్ (phishing), మాల్వేర్ (malware) పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో హ్యాకర్లు వినియోగదారులను ఫేక్ లాగిన్ పేజీలకు డైరెక్ట్ చేసి, వారి పాస్‌వర్డ్‌లను లేదా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) కోడ్స్‌ను కూడా పొందేందుకు ప్రయత్నిస్తారు.
సైబర్ దాడులు
ఈ క్రమంలో అప్రమత్తమైన గూగుల్ తన వినియోగదారులను పాస్‌వర్డ్‌లు అప్‌డేట్ చేయమని సూచిస్తోంది. ఈ సైబర్ దాడి చాలా పెద్దది కాబట్టి జీమెయిల్ ఖాతాలకు మాత్రమే కాకుండా, గూగుల్ సేవల అన్నింటికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. Salesforce అనేది క్లౌడ్ ఆధారిత CRM (Customer Relationship Management) సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్. ఈ ప్లాట్‌ఫామ్‌లో భారీగా డేటా నిల్వ ఉంటుంది. అది హ్యాకర్ల చేతిలో పడితే, చాలా ఇబ్బందులు ఏర్పడవచ్చు.
వినియోగదారులను నమ్మించి..
ఈ సైబర్ దాడి కారణంగా, వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారు. గూగుల్, ఈ సమాచారాన్ని ఉపయోగించి, వినియోగదారులను నమ్మించి వారి ఖాతా వివరాలను చోరీ చేసేందుకు అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఈ హెచ్చరిక ప్రధానంగా వినియోగదారుల ఖాతాలను కాపాడుకోవడం కోసమే.
సైబర్ దాడుల్లో ఎక్కువగా ఫిషింగ్ పద్ధతులు ఉపయోగిస్తారు. ఇవి, మోసపూరితమైన వెబ్‌సైట్‌లను ఉపయోగించి, వ్యక్తిగత సమాచారాన్ని లేదా 2FA కోడ్స్‌ను పొందడం వంటి చర్యలతో లింకై ఉంటాయి. ఈ సైబర్ దాడి వెనుక ఉన్న హ్యాకర్లు, ఈ పద్ధతులను మరింత అధికస్థాయిలో ఉపయోగించి, గూగుల్ వినియోగదారుల ఖాతాలకు ప్రాక్టికల్‌గా పూర్తి యాక్సెస్ పొందటానికి ప్రయత్నిస్తారు.
ఇప్పుడు ఏం చేయాలి?
పాస్‌వర్డ్‌ను వెంటనే మార్చండి: మీ Gmail ఖాతాకు సంబంధించి మీరు ఇప్పటికే పాస్‌వర్డ్ మార్చకపోతే, అది వెంటనే మార్చేయండి. పాస్‌వర్డ్ బలమైనదిగా ఉండాలి.
2FA అమలు చేయండి: 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) ను ఎప్పుడూ ఎనేబుల్ చేయండి. ఇది మీ ఖాతా సెక్యూరిటీని మరింత పెంచుతుంది.
అనుమానాస్పద ఇమెయిల్స్‌ని జాగ్రత్తగా చూడండి: మీ inboxలోకి వచ్చే ఏదైనా అనుమానాస్పద ఇమెయిల్స్ విషయంలో జాగ్రత్త వహించండి.
గూగుల్ ఖాతా సెట్టింగ్స్‌ను చెక్ చేయండి: మీ గూగుల్ ఖాతా సెట్టింగ్స్‌లో ఎలాంటి అపరిమిత యాక్సెస్ లేదా అనుమానాస్పద లింక్స్ ఉంటే వాటిని తొలగించండి.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి