Gaming bill Betting apps: బెట్టింగ్ యాప్‌లను నియంత్రించే గేమింగ్ బిల్లుకు కేబినెట్ ఆమోదం.. కొత్త రూల్స్ తెలుసా..
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:19 PM
దేశంలో ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల మోసాలు బాగా పెరిగిపోయాయి. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించేందుకు కొత్త బిల్లును యూనియన్ క్యాబినెట్ ఆమోదించింది.
గత కొద్ది నెలలుగా దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్‌లు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా యూత్, టీనేజర్లు ఈ యాప్‌ల వలలో చిక్కుకుంటున్నారు. ఊహించని లాభాలు వస్తాయనే ఆశతో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంతే కాకుండా కొన్నింట్లో మోసాలు, డేటా దోపిడీ, టాక్స్ ఎగవేత వంటి కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వీటి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లపై జరిమానా 30%కి పెంచారు. దీంతోపాటు కొత్తగా తెచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్ ద్వారా చట్టపరంగా వీటిని మరింత నియంత్రించేందుకు (Gaming bill Betting apps) సిద్ధమైంది.
నిబంధనలు పాటించకుండా..
కొన్ని బెట్టింగ్ యాప్‌లు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా విదేశాల నుంచి ఆపరేట్ అయ్యే ఆఫ్‌షోర్ యాప్‌లు. ఇవి ఎలాంటి నిబంధనలు పాటించకుండా, పన్ను ఎగవేస్తూ పనిచేస్తున్నాయి. దీనివల్ల యూజర్లు మోసపోతున్నారు, ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, కొందరు సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇలాంటి యాప్‌లను ప్రమోట్ చేయడం వల్ల యువత ఈ యాప్‌ల వైపు ఆకర్షితమవుతోంది. ఈ సమస్యలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
కొత్త బిల్లు ఏం చెబుతోంది?
యూనియన్ క్యాబినెట్ మంగళవారం ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకొచ్చే లక్ష్యంతో రూపొందించబడింది.
ఈ బిల్లు ఫ్రీ గేమ్‌లను, పే గేమ్‌లను స్పష్టంగా వేరు చేస్తుంది
నైపుణ్యం ఆధారిత గేమ్‌లు, అదృష్టం ఆధారిత గేమ్‌ల మధ్య తేడాను నిర్ధారిస్తుంది
ఇకపై సెలబ్రిటీలు లేదా మీడియా సంస్థలు చట్టవిరుద్ధ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకూడదు
ఆన్‌లైన్ గేమింగ్‌లో జరిగే ఆర్థిక లావాదేవీలపై కఠిన నిబంధనలు, వినియోగదారుల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఈ బిల్లు ఆన్‌లైన్ గేమింగ్‌ను సురక్షితంగా, జవాబుదారీగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది
ఇప్పటివరకు ఏం జరిగింది?
ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయంలో చాలా చర్యలు తీసుకుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ 357 చట్టవిరుద్ధ, నిబంధనలు పాటించని ఆఫ్‌షోర్ వెబ్‌సైట్‌లు/URLలను బ్లాక్ చేసింది. అంతేకాదు, సుమారు 2,400 బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, రూ. 126 కోట్లను స్వాధీనం చేసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ (DGGI) 700 ఆఫ్‌షోర్ ఆన్‌లైన్ గేమింగ్ ఆపరేటర్లపై పన్ను ఎగవేత, నిబంధనల ఉల్లంఘనలపై దర్యాప్తు చేస్తోంది.
ఇటీవల, 392 బ్యాంక్ ఖాతాలు, UPI ఐడీలతో సంబంధం ఉన్న ఆఫ్‌షోర్ ఎంటీటీలను ఫ్రీజ్ చేసి, రూ. 122 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69 కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) సహకారంతో జరిగాయి.
గతంలో ఏం జరిగింది?
2023 అక్టోబర్ నుంచి ఆన్‌లైన్ గేమింగ్‌పై 28% GST విధించబడింది. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి గేమ్‌ల ద్వారా వచ్చే గెలుపు మొత్తంపై 30% పన్ను విధిస్తున్నారు. ఆఫ్‌షోర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కూడా ఈ పన్ను నెట్‌లోకి వచ్చాయి. చట్టవిరుద్ధ సైట్‌లను బ్లాక్ చేసే అధికారం కూడా అధికారులకు ఉంది. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు, ప్రభుత్వం 1,400కి పైగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్‌లు, యాప్‌లను బ్లాక్ చేసింది.
ఇవి కూడా చదవండి
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మీ లోన్ ఇంకా మంజూరు కాలేదా..ఇవి పాటించండి, వెంటనే అప్రూవల్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి