Share News

Akash Ambani JioPC: జియో ఫ్రేమ్స్ నుంచి కంప్యూటర్ వరకు..కొత్త ఆవిష్కరణలు ప్రకటించిన ఆకాశ్ అంబానీ

ABN , Publish Date - Aug 29 , 2025 | 03:47 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సమావేశంలో ఆకాశ్ అంబానీ సరికొత్త ఆవిష్కరణ గురించి ప్రకటించారు. అదే జియో పీసీ. అయితే ఇది ఎలా పనిచేస్తుంది? ఎందుకు స్పెషల్ అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Akash Ambani JioPC: జియో ఫ్రేమ్స్ నుంచి కంప్యూటర్ వరకు..కొత్త ఆవిష్కరణలు ప్రకటించిన ఆకాశ్ అంబానీ
Akash Ambani JioPC

రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సమావేశంలో (Reliance AGM) జియో మరోసారి సరికొత్త డిజిటల్ ఉత్పత్తులను ప్రకటించింది. ఈసారి టీవీని కంప్యూటర్‌గా మార్చే కొత్త ఆవిష్కరణతో జియో ముందుకు వచ్చింది. ఈ కొత్త ఉత్పత్తి పేరు JioPC. అదేవిధంగా JioFrames అనే స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా పరిచయం చేసింది. సాధారణంగా మనం కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ కొనాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ జియో కొత్తగా పరిచయం చేసిన JioPCతో ఆ అవసరం లేదు. మీరు ఓ సాధారణ టీవీకి, మానిటర్‌కి కీబోర్డ్ కనెక్ట్ చేస్తే చాలు. అది పూర్తి స్థాయి కంప్యూటర్‌లా పనిచేస్తుంది.


కొత్తగా సాఫ్ట్‌వేర్‌లు..

ఈ కంప్యూటర్ పూర్తిగా క్లౌడ్‌ ఆధారంగా పనిచేస్తుంది. అంటే, డేటా, అప్లికేషన్లు అన్నీ జియో క్లౌడ్‌లో నిల్వ ఉంటాయి. కొత్తగా సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్ చేయాల్సిన పని లేదు. మీరు ఏదైనా అప్డేట్ చేయాలంటే, సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయాలంటే ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు.

ఎలా పనిచేస్తుంది?

మీ ఇంట్లో ఉన్న Jio Set Top Boxకి కీబోర్డ్ కలిపితే చాలు. స్క్రీన్ టీవీ లేదా మానిటర్ పై మీరు వర్చువల్ కంప్యూటర్‌ను చూడవచ్చు. క్లౌడ్‌లో ఉన్న జియో సర్వర్లు ఈ కంప్యూటర్‌కు కనెక్ట్ అవుతాయి. మీరు ఎంత వాడుకుంటారో అంత మేరకు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు.


ఎవరికోసం JioPC?

ప్రధానంగా పాఠశాలలు, కాలేజీ, ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం చక్కగా ఉపయోగపడనుందని ఆకాశ్ అంబానీ తెలిపారు. దీంతోపాటు ఉద్యోగుల రిమోట్ వర్క్, డాక్యుమెంటేషన్, వ్యాపారుల డేటా హ్యాండ్లింగ్, ప్రజెంటేషన్ల కోసం కూడా వినియోగించుకోవచ్చన్నారు. ఇది కేవలం కంప్యూటర్ మాత్రమే కాదని, ప్రతి విద్యార్థి, ఉద్యోగి, వ్యాపారికి AI సత్తా ఉన్న కంప్యూటర్‌ను అందించే లక్ష్యంతో రూపొందించామని ఆకాశ్ అంబానీ చెప్పారు.


ఇంకా ఏం ప్రత్యేకం?

  • జియో పీసీ ద్వారా మీరు ఎన్నో ప్రొడక్టివిటీ టూల్స్, క్రియేటివ్ అప్లికేషన్లు కూడా వినియోగించుకోవచ్చు

  • ఏఐ టూల్స్ కూడా ఇందులో భాగం అవుతాయి

  • మార్కెట్‌లో ఉన్న ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలతో జియో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది

  • జియో సర్వర్లు నుంచి అన్ని అప్డేట్లు వస్తాయి కాబట్టి, మీ కంప్యూటర్ ఎప్పుడూ కొత్త దానిలా పనిచేస్తుంది.

JioFrames కూడా

JioPCతో పాటు జియో పరిచయం చేసిన మరో ఉత్పత్తి JioFrames. ఇవి స్మార్ట్ గ్లాసెస్. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి, మీకు నోటిఫికేషన్లు, కాల్స్, AI సహాయం వంటి పనులను చేస్తాయి. వీటి గురించి పూర్తి సమాచారం మరికొన్ని రోజుల్లో వెలుగులోకి రానుంది.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 29 , 2025 | 03:58 PM