Wasim Akram Criticizes IPL: ఐపీఎల్‌పై పాక్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ సంచలన కామెంట్స్
ABN , Publish Date - Dec 09 , 2025 | 06:05 PM
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)పై తన వక్రబుద్ధిని చూపించాడు. ఐపీఎల్ బోరింగ్ టోర్నీ అంటూ చెత్త కామెంట్స్ చేయడంతో భారత క్రికెట్ అభిమానులు అతడిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ రంగానికి సంబంధించి అయినా సరే.. భారత్‌పై పాకిస్థాన్ తన అక్కసును వెల్లగక్కుతుంది. క్రీడా రంగంలో అయితే పాక్ ప్లేయర్లు భారత్ క్రికెట్, ఇక్కడ జరిగే టోర్నీలపై తలతిక్క కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్(Wasim Akram)తన వక్ర బుద్ధి చూపాడు. ఐపీఎల్ బోరింగ్ టోర్నీ అని.. పాకిస్థా్న్ ప్రీమియర్ లీగ్ నెంబర్ వన్ అంటూ కామెంట్స్ చేశాడు. అలానే ఐపీఎల్ ముగిసేలోపు ఓ పిల్లాడు పుట్టి పెద్దవాడవుతాడని హేళనగా మాట్లాడాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్(Pakistan Super League) 2026 సీజన్ ప్రమోషన్స్‌లో భాగంగా లండన్ వేదికగా పీసీబీ ఓ కార్యక్రమం నిర్వహించింది. వసీం అక్రమ్, పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ, బాబర్ ఆజామ్, హారిస్ రౌఫ్‌లు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ ఎక్కువ రోజుల పాటు జరుగుతుండటంతో బోరింగ్‌గా మారింది. పుట్టిన పిల్లవాడు కూడా పెద్దవాడవుతాడు. కానీ ఐపీఎల్ మాత్రం ముగియదు. మా పీఎస్‌ఎల్ అలా కాదు. కేవలం నెల రోజుల్లోనే పూర్తవుతుంది. విదేశీ ప్లేయర్లు ఇతర దేశాల్లో దాదాపు35 రోజులు ఉండటం పెద్ద సమస్య కాదు.
కానీ ఐపీఎల్ లాంటి ఒక టోర్నీ కోసం 3 నెలల పాటు ఉండటమే కష్టం. అలానే ఆస్ట్రేలియా(Australia)లో జరిగే బిగ్ బాష్ లీగ్ వ్యవధిని కూడా తగ్గించారు. వ్యవధి పరంగానే కాకుండా బౌలింగ్ నాణ్యత పరంగా కూడా పీఎస్‌ఎల్.. ఐపీఎల్ కంటే మెరుగ్గా ఉంది. విదేశీయ ఆటగాళ్లు పీఎస్‌ఎల్ బౌలింగ్ నాణ్యతను ప్రశంసిస్తారు 'అని అక్రమ్ విమర్శించాడు. ఐపీఎల్ గురించి వసీం అక్రమ్(IPL Controversy) చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అతడిపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఐపీఎల్ ముంగిట పీఎస్‌ఎల్ 'పిల్ల బచ్చా' అని కామెంట్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?