Share News

Matthew Hayden: ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మ్యాథ్యూ హేడెన్‌కు వార్నింగ్ ఇచ్చిన కూతురు

ABN , Publish Date - Dec 09 , 2025 | 04:17 PM

ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్ కు అతడి కుమార్తె గ్రేస్ హేడెన్ ఫన్నీ వార్నింగ్ ఇచ్చింది. యాషెస్-2026 సిరీస్ లో జో రూట్ ను సెంచరీ చేయకుండా చేస్తే.. తాను నగ్నంగా తిరుగుతానంటూ హేడెన్ వాగ్దానం చేశాడు.

Matthew Hayden: ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ మ్యాథ్యూ హేడెన్‌కు వార్నింగ్ ఇచ్చిన కూతురు
Matthew Hayden

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ మాథ్యూ హేడెన్(Matthew Hayden) ఇటీవల ఒక వింత వాగ్దానం చేసి.. దాన్ని అమలు చేసే అవకాశం మిస్సయ్యాడు. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్‌లో సెంచరీ చేయకుంటే తాను మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) చుట్టూ నగ్నంగా తిరుగుతానని హేడెన్ వాగ్దానం చేశాడు. అయితే గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో రూట్ సెంచరీ చేయడంతో హేడెన్ తన వాగ్దానాన్ని అమలు చేయలేదు. అయితే ఈ అంశంపై మాథ్యూ హేడెన్ కుమార్తె, క్రికెట్ ప్రెజెంటర్ గ్రేస్ హేడెన్.. తన తండ్రికి గట్టి వార్నింగ్ ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి వాగ్దానం చేస్తే తన తండ్రిని తిరస్కరిస్తానంటూ సరదగా హెచ్చరించింది.


తన తండ్రి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ చుట్టూ నగ్నంగా నడవకుండా అడ్డుకున్నందుకు ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్‌(Joe Root)కు గ్రేస్ హేడెన్ కృతజ్ఞతలు తెలిపింది. 'రూట్ సెంచరీ సాధించినందుకు నేను చాలా కృతజ్ఞురాలిని. నా జీవితంలో మొదటిసారి యాషెస్ సిరీస్‌లో ఒక ఇంగ్లీష్ బాగా రాణించాలని నేను కోరుకున్నాను. అది కూడా మా నాన్న చేసిన చెత్త వాగ్దానం కారణంగా అలా కోరుకున్నాను' అని గ్రేస్ హేడెన్ సోషల్ మీడియాలో ఒక వీడియోలో అన్నారు.


భవిష్యత్‌లో ఎప్పుడైనా తన తండ్రి మళ్ళీ ఏదైనా గ్రౌండ్ చుట్టూ నగ్నంగా పరుగెడతాడని చెబితే తాను అతనిని తిరస్కరిస్తున్నానని గ్రేస్ హేడెన్ తెలిపింది. ఈ వీడియో కంటే ముందు రూట్ సెంచరీ చేసిన వెంటనే గ్రేస్ హేడెన్(Grace Hayden) ఓ వీడియో పోస్ట్ చేశారు. తన తండ్రి వాగ్దానాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 'మా అందరి కళ్ళను కాపాడినందుకు రూట్‌కు కృతజ్ఞతలు' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేసింది. గబ్బా వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ తొలి ఇన్నింగ్స్ లో 138 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

Hardik Pandya: ఫొటో గ్రాఫర్లపై హార్దిక్ పాండ్య అసహనం.. ఎందుకంటే.?

అతడి వికెట్ కీలకం: మార్‌క్రమ్

Updated Date - Dec 09 , 2025 | 05:55 PM