Shardul Thakur: నా కెరీర్ ఆరంభంలో చాలా సపోర్ట్ చేశాడు: శార్దూల్ ఠాకూర్
ABN , Publish Date - Dec 09 , 2025 | 01:37 PM
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్ రూ.2కోట్లకు ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా రోహిత్ శర్మతో తనకున్న అనుబంధాన్ని గురించి గుర్తు చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 వేలానికి ముందు టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టు నుంచి ట్రేడ్ ద్వారా రూ.2కోట్లకు ఎంఐ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మతో కలిసి ఆడటంపై శార్దూల్ స్పందించాడు.
‘నేను రోహిత్ శర్మతో చాలా కంఫర్ట్‌గా ఉంటాను. నన్ను నేను ఎక్స్‌ప్రెస్ చేసుకోవడానికి అతడు నాకు అవకాశం ఇచ్చాడు. నా కెరీర్ ప్రారంభంలో అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నా. నాకు చాలా సపోర్ట్‌గా నిలిచాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో కూడా పాలుపంచుకున్నా. అది నా కెరీర్‌లో ఎదిగేందుకు ఎంతో సాయపడింది’ అని శార్దూల్ అన్నాడు.
గతంలో..
శార్దూల్ గతంలో 2010లో ముంబై తరఫున భాగం అయ్యాడు. జట్టులో యువ సపోర్ట్ బౌలర్‌గా చేరాడు. ప్రాక్టీస్ మ్యాచుల్లో మేటి బ్యాటర్లకు బౌలింగ్ వేశాడు. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, మునాఫ్ పటేల్, అంబటి రాయుడు, ఆండ్రూ సైమండ్స్ వంటి ఆటగాళ్ల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందాడు. శార్దూల్ ఇప్పటి వరకు 105 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 42 ఇన్నింగ్స్‌లో 365 పరుగులు చేశాడు. అలాగే 9.04 ఎకానమీతో 107 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అతడు తన కెరీర్‌లో ఇప్పటివరకు టీమ్‌ఇండియా తరఫున 13 టెస్టుల్లో 377 పరుగులు చేసి, 33 వికెట్లు తీసుకున్నాడు. 47 వన్డేల్లో 329 పరుగులు చేశాడు. అలాగే 65 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 25 టీ20ల్లో 69 రన్స్ సాధించి 33 వికెట్లు తీసుకున్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్