Share News

André Russell Creates History: ఆండ్రీ రస్సెల్ అదిరిపోయే రికార్డ్.. వరల్డ్‌లో ఒక్కే ఒక్కడు

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:47 PM

విండీస్ మాజీ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ చరిత్ర సృష్టించాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఓ టీ 20 మ్యాచ్ లో అరుదైన ఫీట్ సాధించాడు. దీంతో ప్రపంచంలోనే ఒక్కే ఒక్కడిగా రస్సెల్ నిలిచాడు. ఆ రికార్డు ఏంటంటే..

André Russell Creates History: ఆండ్రీ రస్సెల్ అదిరిపోయే రికార్డ్.. వరల్డ్‌లో ఒక్కే ఒక్కడు
André Russell

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ (Andre Russell) గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇంటర్నేషనల్ మ్యాచులతో పాటు ఐపీఎల్ లోనూ రస్సెల్ ఏ స్థాయిలో విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న రస్సెల్.. తాజాగా ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 5000పైగా పరుగులు, 500పైగా వికెట్లు, 500పైగా సిక్సర్లు సాధించిన ఏకైక ఆటగాడిగా రస్సెల్ చరిత్ర సృష్టించాడు.


ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌-2025లో భాగంగా దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రస్సెస్ ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీలో అబుదాబి నైట్ రైడర్స్‌( Abu Dhabi Knight Riders) తరఫున రస్సెల్ ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ లో రస్సెల్ 6 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే లీగ్‌లో 500 టీ20 వికెట్ల మైలు రాయిని కూడా ర‌స్సెల్ అందుకున్నాడు. ఇప్పుడు కేవ‌లం రెండు రోజుల వ్యవ‌ధిలోనే సిక్సర్ల ఘ‌న‌త‌ను అందుకున్నాడు.


ఈ ఏడాది జూలైలో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రస్సెల్ వీడ్కోలు ప‌లికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వివిధ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ర‌స్సెల్ ఐపీఎల్‌(IPL 2026)కు కూడా రిటైర్మెంట్ ప్రక‌టించాడు. మినీ వేలానికి ముందు కేకేఆర్ అత‌డిని రిటైన్ చేసుకోలేదు. మనస్తాపంతోనే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పినట్లు సమచారం. అయితే అత‌డిని కేకేఆర్(KkR) యాజ‌మాన్యం ప‌వ‌ర్ కోచ్‌గా నియ‌మించింది. ఐపీఎల్‌-2026లో కేకేఆర్ జట్టులో కొత్త పాత్రతో ఆండ్రీ ర‌స్సెల్ కనిపించనున్నాడు.


టీ20ల్లో 500 వికెట్లు తీసింది వీళ్లే:

  • రషీద్ ఖాన్ – 500 మ్యాచ్‌లు, 681 వికెట్లు

  • డ్వేన్ బ్రావో – 582 మ్యాచ్‌లు, 631 వికెట్లు

  • సునీల్ నరైన్ – 569 మ్యాచ్‌లు, 602 వికెట్లు

  • ఇమ్రాన్ తాహిర్ – 446 మ్యాచ్‌లు, 570 వికెట్లు

  • షకీబ్ అల్ హసన్ – 462 మ్యాచ్‌లు, 504 వికెట్లు

  • ఆండ్రీ రస్సెల్ – 576 మ్యాచ్‌లు, 500 వికెట్లు


ఈ వార్తలు కూడా చదవండి..

రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్

అతడి వికెట్ కీలకం: మార్‌క్రమ్

Updated Date - Dec 09 , 2025 | 04:21 PM