IPL 2026: వేలం నుంచి 1,005 మందిని తొలగించిన బీసీసీఐ!
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:32 AM
ఐపీఎల్ 2026 వేలానికి సంబంధించిన తుది జాబితా పేర్లను బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 1355 మంది అప్లై చేసుకోగా.. 1005 మందిని తొలగించి, 350 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. కాగా మెగా వేలం డిసెంబర్ 16న జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 మెగా టోర్నీ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీ వేదికగా జరగనుంది. వేలం కోసం అప్లై చేసుకున్న 1,355 మందిలో 350 మంది మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యారు. ఈ మేరకు బీసీసీఐ(BCCI) దీనికి సంబంధించిన జాబితాను ప్రకటించింది. ఇందులో బీసీసీఐ అనూహ్యంగా 1,005 మంది పేర్లను జాబితా నుంచి తొలగించింది. 35 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను చేర్చింది.
‘350 మంది ఆటగాళ్లకు సంబంధించిన ఆక్షన్(IPL 2026) డిసెంబర్ 16 మధ్యాహ్నం 2.30గంటల సమయంలో అబుదాబీలో జరగనుంది’ అని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు పంపిన మెయిళ్లలో బీసీసీఐ పేర్కొంది. మొదట బిడ్డింగ్ ప్రక్రియ.. బ్యాటర్లు, ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్-బ్యాటర్లు, పేసర్లు, స్పిన్ బౌలర్లు అనే విభాగాల వారీగా క్యాప్డ్ ఆటగాళ్లతో ప్రారంభమవ్వనుంది. ఆ తర్వాత అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు కూడా ఇదే వరుస క్రమంలో జరిగే అవకాశముంది.
డికాక్ విషయంలో...
నివేదికల ప్రకారం ఓ ఫ్రాంచైజీ సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ పేరును జాబితాలో చేర్చమని కోరడంతో అతడికి జాబితాలో స్థానం దక్కిన్నట్లు తెలుస్తోంది. డికాక్ గతంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి.. మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల వైజాగ్ వేదికగా టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీతో చెలరేగాడు. అయితే రానున్న ఆక్షన్‌లో క్వింటన్ డికాక్ కనీస ధర రూ.కోటి ఉండనున్నట్లు సమాచరాం. గత వేలంతో పోల్చుకుంటే అతడి ధర 50 శాతం తగ్గింది. గతంలో కేకేఆర్ అతడిని రూ.2కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ వేలంలో కొత్త ఆటగాళ్లు
విదేశీ ఆటగాళ్లు:
అరబ్ గుల్ (ఆఫ్ఘనిస్తాన్), మైల్స్ హమ్మండ్ (ఇంగ్లండ్), డాన్ లాటెగాన్ (ఇంగ్లండ్), క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా), కానర్ ఎస్టర్‌హూజెన్ (దక్షిణాఫ్రికా), జార్జ్ లిండే (దక్షిణాఫ్రికా), బయాండా మజోలా (దక్షిణాఫ్రికా), ట్రావీన్ మాథ్యూ (శ్రీలంక), డిసురి లంకాల్ (పెర్నాగెసల్ వెల్సాల్ లంకా), డిసురి లంకాల్ (శ్రీలంక), అకీమ్ అగస్టే (వెస్టిండీస్).
భారత ఆటగాళ్లు:
సాదేక్ హుస్సేన్, విష్ణు సోలంకి, సబీర్ ఖాన్, బ్రిజేష్ శర్మ, కనిష్క్ చౌహాన్, ఆరోన్ జార్జ్, జిక్కు బ్రైట్, శ్రీహరి నాయర్, మాధవ్ బజాజ్, శ్రీవత్స ఆచార్య, యష్‌రాజ్ పుంజా, సాహిల్ పరాఖ్, రోషన్ వాఘ్‌సారే, యష్ డిచోల్కర్, అయాజ్‌క్ వల్కర్, ధుర్‌మిల్త్ ఖాన్, ధుర్మిల్త్ ఖాన్ పురవ్ అగర్వాల్, రిషబ్ చౌహాన్, సాగర్ సోలంకి, ఇజాజ్ సవారియా, అమన్ షెకావత్.
ఈ వార్తలు కూడా చదవండి..
రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్