Phil Salt: మాకు మాట్లాడుకునే అవసరం రాదు.. కోహ్లీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఫిల్ సాల్ట్
ABN , Publish Date - Dec 09 , 2025 | 10:11 AM
ఆర్సీబీ బ్యాటర్ ఫిల్ సాల్ట్ విరాట్ కోహ్లీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఓపెనింగ్ చేస్తున్న వారితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలని.. తాము కొన్ని సార్లు మాట్లాడుకోలేదని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ ఫిల్ సాల్ట్.. ఐపీఎల్‌లో రాయల్స్ ఛాలెంజర్స్(RCB) బెంగళూరు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బ్యాటింగ్ సమయంలో విరాట్ కోహ్లీ(Virat Kohli)తో తనకున్న అనుబంధాన్ని గురించి ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు.
‘మీరు ఎవరితో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేస్తున్నారో.. వారితో మంచి అనుబంధాన్ని కలిగి ఉండాలి. వారు ఎలా ఆడతారో మీరు అర్థం చేసుకోవాలి. అలాగే వారికి కూడా మీ ఆటపై అవగాహన ఉండాలి. మేమిద్దరం ఇక్కడికి వచ్చిన క్షణం నుంచే మా మధ్య అనుబంధం ఏర్పడింది. మేం ఎలా ఆడతామనే విషయంలో మా ఇద్దరికీ పరస్పర అవగాహన ఉంది. ఉదాహరణకు జైపుర్‌లో మేం పెద్దగా మాట్లాడుకోలేదు. అయినా చక్కటి సమన్వయంతో ఆడాం. ఢిల్లీలోనూ కూడా అంతే.. కొన్నిసార్లు షాట్ల గురించి మాట్లాడుకుంటాం. మరికొన్ని సార్లు మాకు మాట్లాడుకునే అవసరమే రాదు. అది సహజంగా జరిగిపోతుంది’ అని ఫిల్ సాల్ట్(Phil Salt) వెల్లడించాడు.
అదే ట్రెండ్..
‘ప్రస్తుతం క్రికెట్‌లో బ్యాటర్లంతా అటాకింగ్ మోడ్‌లోనే ఆడుతున్నారు. ఒకప్పుడు ఒక బ్యాటర్ ఆరెంజ్ క్యాప్ కోసం ఆడేవాడు. కానీ ఇకపై ఐపీఎల్‌లో ఈ ఆలోచన పనికిరాదు. మా జట్టులోని ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డుల కోసం కాకుండా.. జట్టు విజయం కోసమే ఆడతారు’ అని సాల్ట్ తెలిపాడు. 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీ రూ.11.50కోట్లను సాల్ట్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ ఏడాది ఆర్సీబీ అతడిని రిటైర్ చేసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రో-కో ఇంకా ఏం నిరూపించుకోవాలి?: అశ్విన్