Vijay Hazare Trophy: ‘చిన్నస్వామి’ నుంచి మ్యాచ్‌లు తరలింపు!
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:10 PM
బుధవారం నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి వేదికగా జరగనుంది. అయితే భద్రతా దృష్ట్యా అక్కడి నుంచి మ్యాచులు తరలించారు.
ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్ 24 నుంచి దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ(Vijay Hazare Trophy) ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్ ఢిల్లీ-ఆంధ్ర జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగాల్సి ఉంది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. భద్రతా కారణాల దృష్ట్యా, కోహ్లీ ఆడే మ్యాచుకు ఫ్యాన్స్‌కి అనుమతి లేదంటూ ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరో కర్ణాటక ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచులను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(CoE)లో నిర్వహించనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆంధ్ర-ఢిల్లీ మ్యాచ్ బుధవారం బీసీసీఐ సీఓఈలో ప్రారంభం కానుంది. చిన్నస్వామి మైదానంలో ప్రేక్షకులు లేకుండా పోటీ నిర్వహిస్తామని కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ ప్రతిపాదించారు. దీనికి కర్ణాటక పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ప్రత్యామ్నాయంగా పోటీల వేదికను మార్చారు. కాగా ఇప్పటికే విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు బెంగళూరు చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించడం గమనార్హం.
ఇవీ చదవండి: