Team India: కొత్త కారు కొన్న 'హిట్ మ్యాన్'.. నంబర్ ప్లేట్ సో స్పెషల్
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:50 PM
సాధారణంగా క్రికెటర్లు అంటేనే కొత్త కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఉత్సాహంగా లాంగ్ ట్రిప్ వేసుకొని మైండ్‌ని రిఫ్రెష్ చేసుకొని, పోటీకి సిద్ధం అవుతుంటారు. తాజాగా, టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ మరో కొత్త కారు కొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి తెలియని వారుండరు. క్రికెట్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మూటగట్టుకున్నారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా క్రికెటర్లు అంటేనే కొత్త కార్లను కొనడానికి ఇష్టపడుతున్నారు. ఉత్సాహంగా లాంగ్ ట్రిప్ వేసుకొని మైండ్‌ని రిఫ్రెష్ చేసుకొని, పోటీకి సిద్ధం అవుతుంటారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా తాజాగా మరో కొత్త కారు కొన్నారు. టెస్లా మోడల్ Y ఎలక్ట్రిక్ SUV కారుని ఆయన కొనుగోలు చేశారు. ఈ కారుతో ఉన్న హిట్ మ్యాన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ కారు నంబర్‌కు కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఆయన తన కుమార్తె, కొడుకు పుట్టిన తేదీల ఆధారంగా కారు నంబర్‌ను తీసుకున్నారు. రోహిత్ శర్మ తన కొత్త టెస్లా మోడల్ వై కారుకు '3015' అనే ప్రత్యేక నంబర్ ప్లేట్ తీసుకున్నారు. 30 నంబర్ కుమార్తె సమైరా పుట్టిన రోజు (30 డిసెంబర్) కాగా..15 నంబర్ కొడుకు అహన్ పుట్టిన రోజు (15 ఫిబ్రవరి). టెస్లామాడల్ వై – Rear Wheel Drive, Standard Range Version కారు టెస్లా ఇండియాకు చెందిన స్టాండర్డ్ వేరియంట్ కారు.

రోహిత్ శర్మ కారు గురించి అభిమానులు తెగ సెర్చ్ చేస్తున్నారు. టెస్లా మోడల్ వై కారు.. 15.4- ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో తయారు చేయబడింది. హీటెడ్ & వెంటిలేటెడ్ సీట్లతో దీనిని రూపొందించారు. యాంబియంట్ లైటింగ్, 9 స్పీకర్ల ఆడియో సిస్టమ్‌ని ఈ కారులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (AEB)ను ఈ కారులో ఏర్పాటు చేశారు. బ్లైండ్ స్పాట్ కొలిజన్ వార్నింగ్, టింటెడ్ గ్లాస్ రూఫ్ ఫీచర్లు డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా, లగ్జరీ అనుభవాన్ని ఇస్తాయి. ఈ కారుకి వినూత్న బ్యాటరీ రేంజ్ ఇవ్వబడింది. స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌కు ఒకసారి ఛార్జింగ్ పెడితే సుమారు 500 కిలోమీటర్లు, లాంగ్ రేంజ్‌కు సుమారు 622 కిలోమీటర్లు వస్తుంది. మాడల్ వై స్టాండర్డ్ RWD కారు ధర రూ.59.89 లక్షలు కాగా.. మాడల్ వై లాంగ్ రేంజ్ RWD కారు ధర రూ.67.89 లక్షలుగా నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ విజయం గంభీర్ ది కాదు: రోహిత్
టెస్టు ర్యాంకింగ్స్.. సిరాజ్, జడేజాకు అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..