Share News

Rohit Sharma: ఆ విజయం గంభీర్‌ ది కాదు: రోహిత్

ABN , Publish Date - Oct 08 , 2025 | 06:21 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపు క్రెడిట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ది కాదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా వెల్లడించాడు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి తాను నిర్మించిన టీమ్ తోనే ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ 2024 విజయాలు సాధ్యమయ్యాయని..

Rohit Sharma: ఆ విజయం గంభీర్‌ ది కాదు: రోహిత్
Rohit Sharma

ముంబై, అక్టోబర్ 08: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలుపు క్రెడిట్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ది కాదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పరోక్షంగా వెల్లడించాడు. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి తాను నిర్మించిన టీమ్ తోనే ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్ 2024 విజయాలు సాధ్యమయ్యాయని హిట్ మ్యాన్ స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఓటమి అనంతరమే భిన్నంగా ప్రయత్నించాలని నిర్ణయించుకున్నామని రోహిత్ తెలిపాడు.

టీ20, టెస్ట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా టూర్ తో రోహిత్ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఈ పర్యటనలో అతడు కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగనున్నాడు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించిన సెలెక్టర్లు.. యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను నయా సారథిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - Oct 08 , 2025 | 06:21 PM