Test Rankings 2025: టెస్టు ర్యాంకింగ్స్.. సిరాజ్, జడేజాకు అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:36 PM
టీమిండియా ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తమ కెరీర్‌లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు సాధించారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టిన వీరిద్దరూ బుధవారం నాడు ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.
టీమిండియా ప్లేయర్లు మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తమ కెరీర్‌లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు సాధించారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో అదరగొట్టిన వీరిద్దరూ బుధవారం నాడు ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. విండీస్‌తో మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఏడు వికెట్లు పడగొట్టిన సిరాజ్ (718 పాయింట్లు) మూడు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నాడు. సిరాజ్ కు టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు ఇవే. జస్‌ప్రీత్ బుమ్రా టాప్ లో కొనసాగుతున్నాడు. స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ ఏడు స్థానాలు ఎగబాకి 21 ర్యాంకులో నిలిచాడు.
మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(644 పాయింట్లు) కెరీర్‌లో ఉత్తమ రేటింగ్ పాయింట్లు అందుకున్నాడు. జడ్డూ ఆరు స్థానాలు మెరుగై 25వ స్థానానికి ఎగబాకాడు. విండీస్‌పై జడేజా తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (104*) చేసిన సంగతి తెలిసిందే. అలానే కేఎల్ రాహుల్ నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 35వ స్థానానికి చేరుకున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లాండ్ ప్లేయర్ జో రూట్ నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. యశస్వి జైస్వాల్ రెండు స్థానాలు దిగజారి ఏడో ర్యాంక్‌కు పడిపోగా.. రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ వరుసగా 8, 13 స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో ఉండగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు స్థానాలు మెరుగై 11 స్థానంలో నిలిచాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
పీఎంఓ పేరిట మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్..!
Read Latest Telangana News And Telugu News