Share News

Smriti Mandhana wedding: స్మృతి పెళ్లి ఎప్పుడంటే..?

ABN , Publish Date - Oct 30 , 2025 | 06:48 PM

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలోనే తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌ను ఆమె వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 20న స్మృతి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వారి పెళ్లి వేడుకలు మంధాన సొంతూరు సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.

Smriti Mandhana wedding: స్మృతి పెళ్లి ఎప్పుడంటే..?

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. వచ్చే నెలలోనే తన ప్రియుడు, ప్రముఖ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌(Palash Muchhal)ను ఆమె వివాహం చేసుకోనున్నారు. నవంబర్ 20న స్మృతి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తుంది. వారి పెళ్లి వేడుకలు మంధాన సొంతూరు సాంగ్లీలో జరగనున్నట్లు సమాచారం.


ఇండోర్ కోడలు కాబోతోంది..

ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్‌లో బిజీగా ఉన్న స్మృతి.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత పెళ్లి పనుల్లో నిమగ్నం కానున్నట్లు తెలుస్తోంది. మంధాన చాలా కాలంగా బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. 2019 నుంచి డేటింగ్ చేస్తున్న ఈ జంట గతేడాది తమ ఐదో వార్షికోత్సవం అంటూ రిలేషన్‌షిప్ గురించి అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత ప్రతి వేడుకలోనూ ఇద్దరు కలిసి కనిపించారు. పలాశ్ స్మృతితో పాటు టీమిండియా టూర్లకు కూడా వెళ్తుంటాడు. ఇటీవలే ‘స్మృతి త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’ అంటూ పలాశ్ తమ పెళ్లి గురించి సంకేతాలు ఇచ్చాడు.


పలాశ్ ముచ్చల్ గురించి తెలుసా?

పలాశ్ మే 22, 1995న మార్వారీ కుటుంబంలో జన్మించాడు. ఆయన.. ప్రముఖ గాయకురాలు పాలక్ ముచ్చల్ సోదరుడు. తన సోదరిలాగే పలాశ్ కూడా అనేక పాటలను స్వర పరిచాడు, పాడాడు. దాంతోపాటు ఆయన రాజ్‌పాల్ యాదవ్-రుబీనా దిలైక్ నటించిన ‘అర్ధ్’ చిత్రానికి దర్శకత్వం వహించాడు. పలాష్ తరచుగా తన సోదరి పాలక్‌తో కలిసి ప్రత్యక్ష ప్రదర్శనలు ఇస్తుంటాడు. బాలీవుడ్‌లో అతి పిన్న వయస్కుడైన సంగీత స్వరకర్తగా ప్రపంచ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు

Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి

Updated Date - Oct 30 , 2025 | 06:48 PM