Gold Price Today: ఇవాళ్టి మార్కెట్లో బంగారం ధరలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 08:00 AM
బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,560 గా ఉంది. నిన్నటి ధర రూ.1,22,550. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,360 ఉండగా.. నిన్న,
ఇంటర్నెట్ డెస్క్: బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,560 గా ఉంది. నిన్నటి ధర రూ.1,22,550. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,360 ఉండగా.. నిన్న రూ.1,12,350 గా ఉంది. అంటే నిన్నటికి, నేటికీ బంగారం ధర స్వల్పంగా రూ.10 మేర పెరిగింది. మొన్నటి వరకూ భారీగా ఎగబాకిన బంగారం ధర, రెండు రోజుల క్రితం ఒక్కరోజే రూ.1500 తగ్గి మహిళలకు కొంత ఊరటనిచ్చినంది. అయితే, నిన్న మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ కూడా అలాగే పయనిస్తున్నాయి.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,222,410 గా ఉండగా, నిన్న రూ.1,22,400గా కొనసాగింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,12,210 ఉండగా.. నిన్న రూ.1,12,200గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.91,810గా ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 తులాల బంగారం రూ.1,22,410గా ఉంది. నిన్న రూ.1,22,400గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,210గా ఉండగా.. నిన్న రూ.1,12,200గా ఉంది. తమిళనాడులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,23,560గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,410గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,210గా ఉంది.
వెండి ధరల విషయానికొస్తే, హైదరాబాద్‌లో తులం వెండి రూ. 1661గా ఉంది. కిలో రూ.1,66,100 గా ఉంది. నిన్నటికి, ఇవాళ్టికి వెండి ధర కిలో మీద రూ.100 పెరిగింది. విజయవాడలో 10 గ్రాముల వెండి రూ.1661గా ఉండగా.. కిలో వెండి రూ.1,66,100 గా ఉంది.
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు
Read Latest Telangana News and National News