IND VS NZ: స్మృతి మంధాన, ప్రతీకా శతకాల మోత.. న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Oct 23 , 2025 | 08:42 PM
మహిళా వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు అదరగొట్టారు. ప్రతీక రావల్(122), స్మృతి మంధాన(109) శతకాలతో కివీస్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. వర్షం కారణంగా కివీస్ లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 44 ఓవర్లలో 325 పరుగులకు కుదించారు.
క్రికెట్ న్యూస్: మహిళా వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న కీలక మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు అదరగొట్టారు. ప్రతీక రావల్(122), స్మృతి మంధాన(109) శతకాలతో టీమిండియా.. కివీస్ ముందు భారీ టార్గెట్ ను ఉంచింది. వర్షం కారణంగా కివీస్ లక్ష్యాన్ని డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 44 ఓవర్లలో 325 పరుగులకు కుదించారు. భారత్ జట్టు 49 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది. జెమీమా(76), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(10)లు చివర్లో రాణించడంతో భారత్ కివీస్ ముందు కొండత లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బౌలర్లలో అమేలియా కెర్, సుజీ బేట్స్,రోస్‌మేరీ మైర్ తలో వికెట్ పడగొట్టారు.
న్యూజిలాండ్(New Zealand)తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత ఓపెనర్లు అదరగొట్టారు. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) 95 బంతుల్లో 109 పరుగులతో శతకం బాదేసింది. ఆమె 88 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకుంది. వన్డేల్లో స్మృతికి ఇది 14వ సెంచరీ కావడం విశేషం. సూపర్ ఫామ్ లో ఉన్న మంధాన 212 పరుగుల వద్ద సుజీ బైట్స్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (122) కూడా సెంచరీ చేసింది. 288 పరుగుల వద్ద ప్రతీకను అమేలియా కెర్ ఔట్ చేసింది. ఆ తరువాత జెమీమా రోడ్రిగ్స్(Jemimah Rodrigues), హర్మన్‌ప్రీత్ కౌర్ రాణించడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది.
ఇవాళ(గురువారం) న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ భారత్‌కు(IND VS NZ) చాలా కీలకం. సెమీస్‌కు చేరుకోవాలంటే కివీస్‌పై టీమిండియా కచ్చితంగా విజయం సాధించాలి. బ్యాటింగ్‌లో దుమ్ములేపిన భారత్ జట్టు.. బౌలింగ్ లో ఏవిధంగా రాణిస్తుందో చూడాలి. అయితే వర్షం ఈ మ్యాచ్ ఫలితాన్ని మార్చే అవకాశం కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచుల్లో భారత్ గెలుపు ముగింట వరకు వెళ్లి..చివర్లో తడబడి ఓటమి పాలైంది. అయితే గత మ్యాచులకు భిన్నంగా ఈ మ్యాచ్ లో రాణిస్తారా?. సెమీస్ కు చేరుకుంటారా? అనే విషయంపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. వర్షం కూడా టీమిండియా(Team India) అభిమానులను టెన్షన్ పెడుతుంది. కాగా, ప్రస్తుత ప్రపంచకప్ 2025లో మొదటి మూడు సెమీస్ బెర్త్‌లు ఆస్ట్రేలియా(Australia), సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ లకు ఖరారయ్యాయి. నాలుగో సెమీస్ బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. మరోపక్క బంగ్లాదేశ్, పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
IND VS AUS: రెండో వన్డేలోనూ భారత్ ఓటమి
Virat Kohli Emotional: అడిలైడ్ మ్యాచ్‌లో భావోద్వేగానికి గురైన విరాట్ కోహ్లీ
మరిన్ని తాజా వార్తలు కోసం క్లిక్ చేయండి..