Sanju Samson Ashik: లాస్ట్ ఓవర్, చివరి బంతికి 6 పరుగులు అవసరం..సంజు సామ్సన్ జట్టుకు ట్విస్ట్..
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:32 PM
కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో ఆదివారం జరిగిన కోచ్చి బ్లూ టైగర్స్ vs ఆరీస్ కొల్లం సైలర్స్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి జ్ఞాపకంగా నిలిచింది. ఎందుకంటే చివరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో సంజు సామ్సన్ హీరోగా నిలిచాడు. అసలు ఈ మ్యాచులో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో ఆదివారం తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా కొనసాగింది. కొచ్చి బ్లూ టైగర్స్ (Kochi Blue Tigers)తో ఆరీస్ కొల్లం సైలర్స్ (Aries Kollam Sailors) తలపడ్డాయి. ఆ క్రమంలో చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‌లో సంజు సామ్సన్ టీమ్‌కి మహమ్మద్ ఆషిక్ ట్విస్ట్ ఇచ్చి జట్టను గెలిపించాడు.
మొదట బ్యాటింగ్ చేసిన కొల్లం సైలర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 236 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విష్ణు వినోద్ (94), కెప్టెన్ సచిన్ బేబీ (91) విజృంభించారు. ఈ స్కోర్‌ని చూస్తే, కొచ్చి టైగర్స్‌కి టార్గెట్ చాలా కష్టమనిపించింది. కానీ, సంజు సామ్సన్ కేవలం 51 బంతుల్లో 121 పరుగులు చేసి అదరగొట్టాడు. అతడి బ్యాటింగ్ సమయంలో స్టేడియం అంతా హోరెత్తిపోయింది.
కానీ, అసలు ఉంత్కంఠ చివరి ఓవర్‌లో స్టార్ట్ అయింది. కొచ్చి టైగర్స్‌కి 6 బంతుల్లో 17 పరుగులు కావాలి. మహమ్మద్ ఆషిక్ క్రీజ్‌లో ఉన్నాడు. మొదటి రెండు బంతుల్లోనే బౌండరీ, సిక్సర్‌తో ఆషిక్ అదరగొట్టాడు. మూడో బంతికి సింగిల్ తీసి ఆల్ఫీ ఫ్రాన్సిస్ జాన్‌ని స్ట్రైక్‌లోకి తెచ్చాడు. కానీ, నాలుగో బంతికి జాన్ (7) ఔట్ అయ్యాడు. అయినా, రనౌట్ అయ్యే సమయంలో ఆషిక్‌ని మళ్లీ స్ట్రైక్‌లోకి వచ్చాడు. ఐదో బంతికి పరుగు రాలేదు.
దీంతో చివరి బంతికి 6 పరుగులు కావాలి. స్టేడియం మొత్తం సైలెంట్ అయింది. ఆ క్రమంలో ఆషిక్ బంతిని బలంగా కొట్టాడు..అది సిక్సర్. చివరకి కొచ్చి టైగర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ సిక్సర్‌తో గ్రౌండ్‌లోకి వచ్చిన సంజు సామ్సన్ మొహంలో ఆనందం కనిపించింది. 121 పరుగులతో సంజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకున్నాడు. ఈ విజయంతో కొచ్చి టైగర్స్ తమ మూడు మ్యాచ్‌లలో 3 విజయాలతో మంచి జోరుతో ఉంది.
సంజు సామ్సన్ టీ20 ఇంటర్నేషనల్ కెరీర్ గురించి చెప్పాలంటే, 42 మ్యాచ్‌లలో 38 ఇన్నింగ్స్‌లో 861 పరుగులు చేశాడు. తన యావరేజ్ 25.38, మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత ఏడాది నుంచి ఓపెనర్‌గా సంజు కొత్త జోష్‌లో కనిపిస్తున్నాడు. బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా సిరీస్‌లలో 5 ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలు బాదాడు. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో జరిగే ఆసియా కప్‌కి కూడా సంజు భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి