Rahul Mamkootathil Suspension: నటి వేధింపుల ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే 6 నెలలు సస్పెండ్..
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:25 AM
కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) సోమవారం ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటతిల్‌ని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఎందుకంటే? అతనిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
కేరళ రాజకీయాల్లో పెను దుమారం రేపిన యువ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటతిల్‌పై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం (Rahul Mamkootathil Suspension) తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఆయనను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి 6 నెలలపాటు సస్పెండ్ చేసింది. ఓ నటి చేసిన ఆరోపణలతో వివాదం చుట్టుముట్టగా, పార్టీ తొలుత తీసుకున్న చర్యగా రాహుల్‌ను యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. అప్పుడే రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించకపోయినా, ఇప్పుడు ఈ సస్పెన్షన్‌తో రాహుల్ పార్టీ సమావేశాల్లో పాల్గొనలేరు.
మరింత గందరగోళం
రాహుల్ ఆదివారం తనని తాను సమర్థించుకోవడానికి, ఆరోపణలు చేసిన అవంతికతో వాట్సాప్ చాట్‌లు, ఫోన్ సంభాషణలను విడుదల చేశాడు. వాటిలో ఉన్న వాయిస్ రాహుల్‌దే అని చెబుతోంది. కానీ, రాహుల్ దాన్ని స్పష్టంగా ఖండించలేదు. ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా తన పేరు క్లియర్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. రాష్ట్ర మహిళా కమిషన్, చైల్డ్ రైట్స్ కమిషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాయి. మరో ఆడియో క్లిప్ బయటకు రావడంతో విషయం మరింత గందరగోళంగా మారింది.
ఎమ్మెల్యేగా మాత్రం..
రాహుల్ సస్పెష్షన్ నిర్ణయంతో రాహుల్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లు, ఇతర అధికారిక సమావేశాలకు హాజరు కాలేడు. పార్టీ నాయకులు ఈ నిర్ణయంతో కొంత సమసిపోతుందని ఆశిస్తున్నారు. కానీ రాహుల్ ఎమ్మెల్యేగా కొనసాగుతారు. ఆరోపణలపై పార్టీ దర్యాప్తు ఉండదు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే షానిమోల్ ఉస్మాన్, ప్రస్తుత ఎమ్మెల్యే ఉమా థామస్ లాంటి మహిళా నాయకులు అతను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాహుల్‌పై ఒత్తిడి ఎక్కువైంది.
రాజీనామా డిమాండ్..
యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి తన తప్పును అంగీకరించిన రాహుల్, తన నైతికతను నిలబెట్టుకోవడం ద్వారా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎల్‌డీఎఫ్ కన్వీనర్ టీపీ రామకృష్ణన్ కోరారు. నైతికతను నిలబెట్టుకోవడం ద్వారా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, రమేష్ చెన్నితల సహా రాహుల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి
సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..
అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి