Share News

Rohit Good bye To Australia: మేం మళ్లీ ఆడుతామో లేదో.. రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్

ABN , Publish Date - Oct 25 , 2025 | 06:20 PM

సిడ్నీ వన్డేలో విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవి శాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ కృతజ్ఞతలు తెలిపాడు. తాము ఇక ఆడతామో లేదో తెలియదన్నాడు.

Rohit Good bye To Australia: మేం మళ్లీ ఆడుతామో లేదో.. రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్
Rohit Sharma

క్రికెట్ న్యూస్: సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.. విరాట్ కోహ్లీ (81 బంతుల్లో 7 ఫోర్లతో 74 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో రాణించాడు. ఇక మ్యాచ్(Sydney Match) అనంతరం రోహిత్ శర్మ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాను, విరాట్ కోహ్లీ మళ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఆడుతామో లేదో తెలియదని వెల్లడించాడు.


ఆఖరి వన్డే(India vs Australia)లో విజయానంతరం దిగ్గజ క్రికెటర్లు రవి శాస్త్రి, ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ కృతజ్ఞతలు తెలిపాడు. తనకు ఆస్ట్రేలియా పర్యటనకు రావడం ఎప్పుడూ ఇష్టమేనని తన మనసులోని మాటలను తెలిపాడు. సిడ్నీ వేదికగా ఆడటం సంతోషంగా ఉంటుందన్నాడు. తన తొలి ఆసీస్ పర్యటన 2008లో ప్రారంభమైందని, అప్పటి నుంచి నేటి వరకు ఆసీస్ తో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయన్నాడు.


రోహిత్ (Rohit Sharma) ఇంకా మాట్లాడుతూ..'ఈ పర్యటన కూడా చాలా సరదాగా గడిచింది. నేను, కోహ్లీ మళ్లీ క్రికెటర్లుగా ఆసీస్‌కు వస్తామో లేదో తెలియదు. ఆస్ట్రేలియా(Australia) గడ్డపై ప్రతీ క్షణాన్ని ఎంతో ఆనందగా ఆస్వాదించాను. గత 15 ఏళ్లలో మేము సాధించిన ఘనతల కంటే క్రికెట్ ఆడటం ఎక్కువగా సంతోషాన్ని ఇచ్చింది. నాకు ఎలా అనిపిస్తుందో విరాట్ కోహ్లీ(Virat Kohli)కీ అలాగే ఉంటుందని అనుకుంటున్నాను' అని రోహిత్ శర్మ అన్నాడు.



Also Read:

Gautam Gambhir's Reaction: రోహిత్ శర్మ 50వ సెంచరీ.. గంభీర్ అదిరిపోయే రియాక్షన్

IND VS AUS: రోహిత్‌ శర్మ సెంచరీ..మూడో వన్డేలో భారత్ ఘన విజయం

Updated Date - Oct 25 , 2025 | 09:10 PM