Rohit Sharma-Virat Kohli: రో-కో మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడంటే..?
ABN , Publish Date - Oct 26 , 2025 | 01:20 PM
కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను చూసి సిడ్నీ ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ముగిసింది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన ఆసీస్ 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. టీమిండియా చివరి మ్యాచ్‌లో విజయం సాధించినా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం.. అద్భుత ప్రదర్శన చేయడం మాత్రం అభిమానులకు జోష్ తెప్పించింది. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న ఈ ఇద్దరి బ్యాటింగ్‌ను చూసి సిడ్నీ(Sydney) ప్రేక్షకులు కూడా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అయితే.. ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. రో-కో(Ro-Ko) మళ్లీ మైదానంలో కనిపించేది ఎప్పుడు..?
ఆస్ట్రేలియాతో టీమిండియా (Team India) ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) , రోహిత్ శర్మ (Rohit Sharma) స్వదేశానికి తిరిగొచ్చేస్తారు. వచ్చే నెలాఖరున సౌతాఫ్రికాతో మూడు వన్డేల(ODI) సిరీస్ ఉంది. ఆ తర్వాత మరొక నెల వ్యవధిలోనే న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈలోపు రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలు ఆడే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఎలైట్, ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. నవంబర్ 1 నుంచి ఎలైట్ విభాగంలో ముంబై, ఢిల్లీ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ రెండు జట్లకు రోహిత్, విరాట్ ప్రాతినిధ్యం వహిస్తే ఇటు ట్రోఫీకి స్టార్ కళ వస్తుంది.. అటు వారికీ బ్యాటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. ఇక జులై 2026లో ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం ఇతర జట్లతో మరికొన్ని వన్డేలు కూడా ఆడే అవకాశం ఉంది. వీటన్నింటికి రో-కో సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అయితే ఫిట్‌నెస్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా తుది జట్టులో అవకాశం రావడం కష్టమే.
విజయ్ హజారే ట్రోఫీలో ఆడే ఛాన్స్..
కేవలం వన్డేల్లోనే ఆడుతున్న వీరిద్దరూ దేశవాళీ మ్యాచుల్లోనూ పాల్గొనాల్సి ఉంటుందని మేనేజ్‌మెంట్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబర్-జనవరి మధ్యలో విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో వన్డే సిరీస్‌ల మధ్య ఈ ట్రోఫీ రానుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచుల్లో ఆడేందుకు మాత్రమే అక్కడ వెసులుబాటు ఉంది. ఎందుకంటే న్యూజిలాండ్‌తో సిరీస్‌కు సిద్ధమవ్వాల్సి ఉంటుంది.
రాబోయే వన్డే సిరీస్‌లివే..
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు
* నవంబర్ 30న రాంచీ వేదికగా తొలి వన్డే
* డిసెంబర్ 3న రాయ్‌పుర్ వేదికగా రెండో వన్డే
* డిసెంబర్ 6న వైజాగ్ వేదికగా మూడో వన్డే
న్యూజిలాండ్ వన్డే సిరీస్
* వడోదర వేదికగా జనవరి 11న తొలి వన్డే
* రాజ్‌కోట్ వేదికగా జనవరి 14న రెండో వన్డే
* ఇండౌర్ వేదికగా జనవరి 18న మూడో వన్డే
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ
పీఏసీ దర్యాప్తు జరగాలి కాంగ్రెస్