Share News

Ashwin IPL Retirement: ధోని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న అశ్విన్.. ఐపీఎల్‎ విషయంలో షాకింగ్ నిర్ణయం..

ABN , Publish Date - Aug 27 , 2025 | 04:33 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో గుర్తుండిపోయే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తన ఐపీఎల్ ప్రయాణానికి గుడ్‌బై చెప్పేశాడు. ధోని కంటే ఎక్కువ మనీ తీసుకుంటున్న అశ్విన్ ఎందుకు అలా చెప్పాడు, ఎంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Ashwin IPL Retirement:  ధోని కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న అశ్విన్.. ఐపీఎల్‎ విషయంలో షాకింగ్ నిర్ణయం..
Ashwin IPL Retirement

ఐపీఎల్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ గురించి షాకింగ్ న్యూస్ వచ్చింది. బుధవారం (ఆగస్టు 27, 2025) అశ్విన్ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) లో తిరిగి చేరిన ఈ స్టార్ స్పిన్నర్, ఇంకా కొన్ని సీజన్లు ఆడతాడని అందరూ ఊహించారు. కానీ, అతను ఊహించని నిర్ణయం తీసుకుని ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు (Ashwin IPL Retirement). ప్రతి ముగింపు కొత్త ప్రారంభానికి నాంది. నా ఐపీఎల్ జర్నీ ఇక్కడ ముగిసింది. కానీ ఇతర లీగ్‌లలో కొత్త అనుభవాలు పొందే సమయం మొదలైందని అశ్విన్ ఎక్స్‌లో పోస్ట్ చేసి ప్రకటించాడు.


అశ్విన్ జీతం ఎంతో తెలుసా..

ఐపీఎల్ 2025 మెగా వేలంలో అశ్విన్‌ను సీఎస్‌కే రూ. 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది మన థలా ధోని కంటే దాదాపు రూ. 6 కోట్లు ఎక్కువ కావడం విశేషం. ధోనిని సీఎస్‌కే అన్‌క్యాప్డ్ కేటగిరీలో రూ. 4 కోట్లకు రిటైన్ చేసింది. అంటే, అశ్విన్ జీతం ధోని కంటే రూ. 5.75 కోట్లు ఎక్కువ. సీఎస్‌కే అశ్విన్‌ను తిరిగి తీసుకోవడానికి లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్‌లతో పోటీపడి వేలంలో గెలిచింది.


ఐపీఎల్ 2025లో అశ్విన్ పర్ఫార్మెన్స్

సీఎస్‌కేలో అశ్విన్ హోమ్‌కమింగ్ అంత గొప్పగా సాగలేదు. 2025 సీజన్‌లో అతను 9 మ్యాచ్‌లలో కేవలం 7 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ రేట్ 9.13తో బౌలింగ్ చేశాడు. ఇది అశ్విన్ స్థాయికి చాలా తక్కువ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అయినా, అతని ఐపీఎల్ కెరీర్ మొత్తం చూస్తే, సీఎస్‌కే తరపున 106 మ్యాచ్‌లలో 97 వికెట్లు తీసిన రికార్డ్ ఉంది.


అశ్విన్ ఐపీఎల్ జర్నీ

అశ్విన్ ఐపీఎల్‌లో సీఎస్‌కేతో 2008లో తొలి సీజన్‌లోనే చేరాడు. 2009లో డెబ్యూ చేసి, 2010, 2011లో సీఎస్‌కే ఛాంపియన్‌గా నిలిచిన టీంలో కీలక పాత్ర పోషించాడు. ఆ పర్ఫార్మెన్స్‌తోనే అతనికి భారత జట్టులో చోటు దక్కింది. 2018లో సీఎస్‌కే తిరిగి అశ్విన్‌ను తీసుకోవాలని ప్రయత్నించినా, అతను పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. అక్కడ రెండు సీజన్లు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

ఆ తర్వాత డిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్‌లలో ఆడి, మళ్లీ 2025లో సీఎస్‌కేలోకి వచ్చాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పిన అశ్విన్, ఇకపై విదేశీ టీ20 లీగ్‌లలో ఆడనున్నాడు. అతని అనుభవం, స్పిన్ బౌలింగ్ నైపుణ్యం ఇతర లీగ్‌లలో ఎలా రాణిస్తారో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..ఎన్ని రోజులు వచ్చాయంటే..

అర్జెంటుగా డబ్బు అవసరం.. పర్సనల్ లోన్ తీసుకోవాలా? గోల్డ్ బెటరా?

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 27 , 2025 | 04:34 PM