Rashiid Khan: పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ నిప్పులు
ABN , Publish Date - Oct 18 , 2025 | 02:56 PM
పాకిస్థాన్ వైమానిక దాడుల్లో ముగ్గురు క్రికెటర్లు చనిపోవడంపై ఆఫ్గన్ క్రికెట్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పాక్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ చర్యను పూర్తిగా అనైతికంగా, అమానుషంగా ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ సైనికులు ఆఫ్గనిస్తాన్ సరిహద్దులో జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై ఆఫ్గన్ క్రికెట్ కెప్టెన్ రషీద్ ఖాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక పాకిస్తాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ చర్యను పూర్తిగా అనైతికంగా, అమానుషంగా ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్( Pakistan) వైమానిక దాడుల నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ.. వచ్చే నెలలో పాకిస్తాన్, శ్రీలంకతో కలిసి జరగాల్సిన ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు(Afghanistan Crickete Board) నిర్ణయంతో నవంబర్ 5 నుంచి 29 వరకు లాహోర్, రావల్పిండిలలో జరగాల్సిన ఈ ట్రై-సిరీస్ అనిశ్చితిలో పడింది. ఈ దాడిని పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన పిరికిపంద చర్య అంటూ ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా ఖండించింది.
ఇక ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్(Rashiid Khan ) సోషల్ మీడియా ద్వారా పాక్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రకటనలో పౌరులు, మహిళలు, పిల్లలు, దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కంటున్న యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా అనైతికం, అమానుషమని, పాకిస్థాన్ చట్టవిరుద్ధమైన చర్యలతో మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించిందంటూ ఫైర్ అయ్యాడు. ఈ మానవ హక్కుల ఉల్లంఘనలను అంతర్జాతీయ వేదికపై లేవనెత్తాలని రషీద్ ఖాన్ డిమాండ్ చేశారు. అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనందుకు, ట్రై సిరీస్ నుంచి వైదొలగాలని ఆఫ్గన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నట్లు రషీద్ ఖాన్(Rashiid Khan) సమర్థించారు.
ఇవి కూడా చదవండి
పీసీబీ చీఫ్ కుతంత్రాలు.. ఇప్పటికీ టీమిండియా చేతికి దక్కని ఆసియా కప్ ట్రోఫీ
ఇలా అనడం సిగ్గు చేటు.. మాజీ క్రికెటర్‌పై మండిపడ్డ గౌతమ్ గంభీర్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి