Gautam Gambhir: ఇలా అనడం సిగ్గు చేటు.. మాజీ క్రికెటర్‌పై మండిపడ్డ గౌతమ్ గంభీర్
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:34 PM
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై అభ్యంతరం చెప్పిన మాజీ క్రికెటర్ శ్రీకాంత్‌పై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కామెంట్ చేశారు. 23 ఏళ్ల కుర్రాడిని అలా అనడం సరికాదని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియా వన్డే టూర్ కోసం పేసర్ హర్షిత్ రాణాను ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ అభ్యంతరం చెప్పిన తెలిసిందే. గంభీర్ చెప్పినదానికల్లా యస్ చెప్పినందుకు ఆస్ట్రేలియా వన్డే టూర్‌కు ఎంపికయ్యాడని సరదాగా కామెంట్ చేశారు. దీంతో, కొందరు సోషల్ మీడియాలో హర్షిత్‌ను..హెడ్ కోచ్ ఫేవరెట్ ప్లేయర్ అని ట్రోల్ చేశారు. ఈ పరిణామంపై గౌతమ్ గంభీర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు (Gautam Gambhir-Krish Srikkanth).
‘ఇది కొంచెం సిగ్గు చేటు. మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే.. యూట్యూబ్‌లో వ్యూస్ కోసం 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేయడం అన్యాయం. అతడిది సాధారణ నేపథ్యం. అతడి తండ్రేమీ మాజీ చైర్మనో లేదా మాజీ క్రికెటరో లేదా ఎన్నారైనో కాదు. ఇప్పటివరకూ అతడు తన సామర్థ్యంతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే రీతిలో ఇకముందూ కొనసాగుతాడు. కాబట్టి ఎవరినైనా ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం సబబు కాదు’ అంటూ శ్రీకాంత్ పేరెత్తకుండానే విమర్శలు గుప్పించారు (Row over Harshit Rana Selection).
‘23 ఏళ్ల కుర్రాడి గురించి చేసే విమర్శలు సోషల్ మీడియాలో మరింత పెద్దవి అవుతాయి. రేపు మీ బిడ్డే క్రికెట్ ఆడొచ్చు. అప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అతడి వయసు జస్ట్ 23. 33 ఏళ్లు కాదు. కావాలంటే నన్ను అనండి.. నేను తట్టుకోగలను. కానీ 23 ఏళ్ల కుర్రాడిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. భారత క్రికెట్ విషయంలో కొంత బాధ్యతగా ఉండాలి. యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ కోసం ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. కేవలం హర్షిత్ కోసం ఇలా చెప్పట్లేదు. ఇతరుల భవిష్యత్తు కోసం ఈ మాటలంటున్నా’ అని గంభీర్ అన్నాడు.
హర్షిత్ తో పాటు ఇతర యువ క్రీడాకారుల ఎంపికపై కూడా శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘టీమ్‌లో నితీశ్ రెడ్డి ఎందుకు? ఇదే ప్రశ్న వాళ్లను అడిగితే హార్ధిక్ పాండ్యా స్థానంలో ఎంపిక చేశామని చెబుతారు. కానీ హార్ధిక్ స్థానాన్ని భర్తీ చేయాల్సింది జడేజాతో’ అని కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి
National Junior Athletics Championship: మోహిత్ వెంకట్రామ్ పసిడి ధమాకా
Vaibhav Suryavanshi: వైభవ్ మరో చరిత్ర
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి